మాయావతి సోదరుడి ఆస్తులు ఎంతో తెలుసా?

బిఎస్పీ నేత మాయావతి సోదరి ఆస్తులు దిమ్మతిరిగే రీతిలో పెరిగాయి. దీంతో ఐటి అధికారులు ఆయన ఆస్తులపై దృష్టి సారించారు

న్యూఢిల్లీ: ప్రముఖ భారతీయ పారిశ్రామికవేత్తల జాబితాలో ఆయన పేరు లేదు. దేశంలో ఆయన అంతగా పేరు ప్రఖ్యాతులున్న వ్యక్తి కూడా కారు. కానీ, ఆయన ఆస్తులు ఏడేళ్లలో రూ.7.5 కోట్ల నుంచి రూ.1,316 కోట్లకు పెరిగాయి. ఉత్తరప్రదేశ్‌లో బీఎస్పీ అధినేత్రి మాయావతి ముఖ్యమంత్రిగా ఉన్న 2007-2014 కాలంలో ఆమె సోదరుడు ఆనంద్‌కుమార్ ఆస్తులు ఆ విధంగా పెరిగాయి.

దీంతో ఆయన ఆర్థికలావాదేవీలపై ఆదాయం పన్ను(ఐటీ) శాఖ నిఘా పెట్టింది. బూటకపు కంపెనీలు, భారీగా రుణాలు, పెద్దఎత్తున రియల్ ఎస్టేట్ పెట్టుబడుల ముసుగులో భారీగా ఆనంద్‌కుమార్ ఆస్తులు కూడబెట్టినట్టు ఐటీ గుర్తించిందని, వాటిపై విచారణ జరుపుతున్నదని, దీనికి సంబంధించిన పత్రాలను టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక సంపాదించింది.

Rs 1,300 crore rise in assets of Mayawati’s brother

ఆకృతి హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి సంబంధించిన కేసునే తొలుత విచారణకు ఐటీ స్వీకరించింది. బూటకపు కంపెనీలు, అక్రమ ఆర్థిక వ్యవహారాలపై సంబంధిత శాఖలు విచారణ జరుపుతున్నట్టు ప్రభుత్వవర్గాలు వెల్లడించినట్టు ఆ పత్రిక వార్తాకథనం తెలిపింది.

ఢిల్లీకి చెందిన ఆకృతి హోటల్స్‌లో ముగ్గురు వాటాదారులు ఉన్నారు. అయితే, అందరూ న్యాయబద్దమైన వాటాదారులు కారని సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+