తల్లా? పెళ్లామా?: సీఎంపై అనర్హత వేటు - నెక్స్ట్ చీఫ్ మినిస్టర్ ఎవరు?

రాంచీ: ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సారథ్యంలో జార్ఖండ్‌లో అధికారంలో ఉన్న జార్ఖండ్ ముక్తి మోర్చా-కాంగ్రెస్ పార్టీ మహాకూటమి సంకీర్ణ ప్రభుత్వం ఇబ్బందుల్లో పడింది. మహారాష్ట్ర తరహా పరిణామలు అక్కడ తలెత్తేలా కనిపిస్తోన్నాయి. హేమంత్ సోరెన్‌‌ను గద్దె దించడానికి చాపకింద నీరులా ప్రయత్నాలు సాగుతున్నాయి. అవి మరింత ముమ్మరం అయ్యాయి. ఆయనపై అనర్హత వేటు వేసేలా చర్యలు తీసుకునే అవకాశాలు లేకపోలేదు.

అనర్హతకు..

అనర్హతకు..


ప్రజా ప్రతినిధుల చట్టం- 1951 కింద శాసన సభ్యుడిగా ఆయనను అనర్హుడిగా గుర్తించేలా పావులు మరింత చురుగ్గా కదులుతున్నాయి. గనుల మంత్రిత్వ శాఖను పర్యవేక్షిస్తోన్న హేమంత్ సోరెన్- తనకు తానే గనుల లీజును మంజూరు చేసుకోవడం ద్వారా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనే ఆరోపణలను ఎదుర్కొంటోన్నారు. ఎమ్మెల్యేగా అనర్హత వేటు వేయాలంటూ కేంద్ర ఎన్నికల కమిషన్ గవర్నర్‌కు ప్రతిపాదించిందనే వార్తలు వెల్లువెత్తుతున్నాయి.

కీలక భేటీ..

కీలక భేటీ..

ఈ పరిణామాల మధ్య హేమంత్ సోరెన్- ఇవ్వాళ కీలక సమావేశాన్ని నిర్వహించబోతోన్నారు. జార్ఖండ్ ముక్తి మోర్చా-కాంగ్రెస్-రాష్ట్రీయ జనతా దళ్-నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ-సీపీఐ (ఎంఎల్) శాసన సభ్యులు ఈ భేటీలో పాల్గొనబోతోన్నారు. రాజధాని రాంచీలో గల సోరెన్ అధికారిక నివాసంలో ఈ భేటీ ఏర్పాటు కానుంది. తనపై అనర్హత వేటు పడితే- ఆ తరువాతి పరిణామాలను ఎలా ఎదుర్కోవాల్సి ఉంటుందనే విషయం మీద ఈ సమావేశంలో చర్చించనున్నారాయన.

 అధికారంలో..

అధికారంలో..

జార్ఖండ్ అసెంబ్లీలో జార్ఖండ్ ముక్తిమోర్చా-కాంగ్రెస్ సంకీర్ణ కూటమికి 48 స్థానాల బలం ఉంది. రాష్ట్రీయ జనతా దళ్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, సీపీఐ (ఎంఎల్)కు ఒక్కో స్థానం ఉంది. ఈ మూడు పార్టీలు జేఎంఎం-కాంగ్రెస్ సంకీర్ణానికి మద్దతు ఇస్తోన్నాయి. భారతీయ జనతా పార్టీకి ఉన్న సీట్ల సంఖ్య 26. మిత్రపక్షం ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్‌, ఇద్దరు స్వతంత్రులతో కలుపుకొని బీజేపీ 30 స్థానాలతో ప్రతిపక్ష పాత్రను పోషిస్తోంది.

 తల్లి? లేదా భార్య..

తల్లి? లేదా భార్య..


అనర్హత వేటు పడితే- తన స్థానంలో ముఖ్యమంత్రిగా ఎవరిని నియమించాల్సి ఉంటుందనే విషయం మీద హేమంత్ సోరెన్ ఇప్పటికే ఓ స్పష్టతకు వచ్చినట్లు చెబుతున్నారు. తన తల్లి రూపీ సోరెన్ లేదా భార్య కల్పన సోరెన్‌ను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టొచ్చని చెబుతున్నారు. కల్పన సోరెన్‌పై భారతీయ జనతా పార్టీ ఇప్పటికే కొన్ని ఆరోపణలను తెర మీదికి తీసుకొచ్చిన నేపథ్యంలో- ఆ అవకాశం మళ్లీ వారికి ఇవ్వకుండా ఉండటానికి హేమంత్ సోరెన్.. తల్లిని ముఖ్యమంత్రిని చేస్తారనే ప్రచారం జరుగుతోంది.

బీజేపీ వ్యూహాత్మకంగా..

బీజేపీ వ్యూహాత్మకంగా..

హేమంత్ సోరెన్ మీద అనర్హత వేటును వేయాల్సిన పరిస్థితే వస్తే- సంకీర్ణ కూటమి ప్రభుత్వాన్ని కుప్ప కూల్చడానికి బీజేపీ పావులు కదుపుతుందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. అదే సమయంలో తనకు బదులుగా ఈసీ తన అభిప్రాయాన్ని గవర్నర్‌కు తెలియజేయడం పట్ల హేమంత్ సోరెన్ స్పందించారు. దీని వెనుక బీజేపీ ఉందని ఆరోపించారు. తన ప్రభుత్వాన్ని అస్థిరపర్చడానికి బీజేపీ ఎంపీలు ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు సాగిస్తోన్నాయని, దీనికి కొందరు జర్నలిస్టులు సహకరిస్తోన్నారని మండిపడ్డారు.

 సీల్డ్ కవర్‌లో..

సీల్డ్ కవర్‌లో..

దీనిపై ఇదివరకే జార్ఖండ్ గవర్నర్ రమేష్ బైస్.. కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. తన అభిప్రాయాన్ని తెలియజేయాలంటూ సూచించారు.ఆయన చేసిన సూచనల మేరకు కేంద్ర ఎన్నికల సంఘం సీల్డ్ కవర్‌లో తన అభిప్రాయాన్ని తెలియజేసింది. అందులో ఉన్న సారాంశం ఏమిటనేది తెలియరావట్లేదు. మైనింగ్ లీజ్ విషయంలో హేమంత్ సోరెన్.. ప్రజా ప్రతినిధుల చట్టాన్ని ఉల్లంఘించినట్లు ఆరోపణలను ఎదుర్కొంటోన్నారు. ఈ విషయంపై భారతీయ జనతా పార్టీ ఫిర్యాదులు చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+