ర్యాన్‌స్కూల్ ఘటన: ఆందోళన హింసాత్మకం, లాఠీఛార్జీ

Posted By:
Subscribe to Oneindia Telugu

గురుగ్రామ్: ప్రైవేట్ పాఠశాల ఆవరణలో ఏడేళ్ళ బాలుడి హత్యను నిరసిస్తూ గుర్‌గ్రామ్‌లో విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన ఆదివారం నాడు హింసాత్మకంగా మారింది. దీంతో ఆందోళనకారులపై పోలీసులు లాఠీచార్జీ చేశారు.

ఆందోళనకారులు ర్యాన్ అంతర్జాతీయ స్కూల్‌పై దాడి చేసి కిటికీల అద్దాలు ధ్వంసం చేశారు. స్కూల్‌కు సమీపంలో ఉన్న మద్యం దుకాణానికి నిప్పు పెట్టారు.

Ryan International School murder: Protesters set liquor shop outside campus on fire, police resort to lathicharge

పరిస్థితి విషమిస్తోందని బావించిన పోలీసులు ఆందోళనకారులపై లాఠీచార్జీ చేశారు. పెద్ద ఎత్తున మోహరించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఏడేళ్ళ బాలుడు ప్రద్యుమన్ ఠాకూర్‌ను బస్ డ్రైవర్ కిరాతకంగా గొంతుకోసి చంపేశాడు. బాలుడిపై లైంగికదాడికి తాను ప్రయత్నించడంతో బాలుడు ప్రతిఘటించాడని అందుకే చంపేశానని నిందితుడు తెలిపాడు.

మరోవైపు నిందితుడితో పాటు స్కూల్ యాజమాన్యంపై కూడ చర్య తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై సిబిఐ దర్యాప్తు జరిపించాలని కోరుతున్నారు. స్కూల్ యాజమాన్యంపై చర్య తీసుకోవాలని పేరేంట్స్ డిమాండ్ చేస్తున్నారు. నిందితులపై చర్య తీసుకొంటామని హార్యనా ప్రభుత్వం ప్రకటించింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The Gurgaon police on Sunday resorted to lathi charge after people gathered outside the Ryan International School to protest against the death of an eight-year-old student who was murdered on Friday morning.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X