అంత బ్యాడేం కాదు: కల్లిస్‌కు టెండూల్కర్ ఊరడింపు

న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్ టెస్టు నుంచి తప్పుకున్న దక్షిణాఫ్రికా ఆటగాడు జాక్విస్ కల్లిస్‌కు భారత మాస్టర్ బ్లాస్టర్ ఊరడింపు మాటలు చెప్పారు. రిటైర్డ్ లైఫ్ అంత బ్యాడ్‌గా ఏమీ ఉండదని ఆయన చెప్పారు. కల్లిస్‌ను సచిన్ టెండూల్కర్ నిజమైన ఛాంపియన్‌గా అభివర్ణిస్తూ సరైన స్ఫూర్తితో ఆడాడని అన్నారు.

జాక్విస్‌తో కలిసి క్రికెట్ ఆడినందుకు తనకు సంతోషంగా ఉందని కూడా సచిన్ టెండూల్కర్ అన్నాడు. ప్రపంచంలోని ఉత్తమ ఆల్ రౌండర్లలో ఒక్కడైన జాక్విస్ కల్లిస్ అంతర్జాతీయ టెస్టు క్రికెట్ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. తన చివరి మ్యాచులో కల్లిస్ సెంచరీ సాధించాడు.

Jacques Kallis

ప్రపంచంలోని అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్లలో కల్లిస్ మూడో వాడిగా నిలిచాడు. దానికి తోడు తన చివరి మ్యాచులో భారత్‌పై దక్షిణాప్రికా విజయం సాధించడం కూడా అతనికి మంచి వీడ్కోలుగానే భావించాల్సి ఉంటుంది.

కల్లిస్ 166 టెస్టులు ఆడి 13,289 పరుగులు చేశాడు. టెండూల్కర్ 15,921 పరుగులు చేసి మొదటి స్థానంలో ఉండగా, 13,378 పరుగులు చేసి రికీ పాంటింగ్ రెండో స్థానంలో ఉన్నాడు. మూడో స్థానంలో ఉన్న రాహుల్ ద్రావిడ్‌ను కల్లిస్ వెనక్కి నెట్టేశాడు. కల్లిస్ వన్డే మ్యాచుల్లో మాత్రం కొనసాగుతాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+