వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

క్రికెటరే కాదు, మంచి మనిషి: సచిన్‌పై రాహుల్ గాంధీ

|
Google Oneindia TeluguNews

Rahul Gandhi
శ్రీనగర్: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌పై కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రశంసల వర్షం కురిపించారు. జమ్మూకాశ్మీర్ రాష్ట్ర పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ గురువారం మీడియాతో మాట్లాడారు. సచిన్ టెండూల్కర్ ఓ గొప్ప క్రికెటరే కాదు.. ఓ మంచి మనిషి అని ఆయన వ్యాఖ్యానించారు. సచిన్ టెండూల్కర్‌తో తనకు మంచి అనుబంధం ఉందని ఆయన చెప్పారు.

సచిన్ టెండూల్కర్ ఓ గొప్ప క్రికెటర్, విలువలతో కూడిన వ్యక్తి అని ఆయన వ్యాఖ్యానించారు. అందుకే క్రికెటర్‌గా కంటే సచిన్ టెండూల్కర్‌ను ఓ గొప్ప వ్యక్తిగా ఇష్టపడతానని రాహుల్ గాంధీ అన్నారు. క్రికెట్ జీవితానికి ముగింపు పలకనున్న మాస్టర్ సచిన్ టెండూల్కర్‌కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

నవంబర్ 14 నుంచి 18వరకు తనకిష్టమైన ముంబైలోని వాంఖడే స్టేడియంలో వెస్టిండీస్ జట్టుతో 200వ టెస్టు ఆడిన తర్వాత సచిన్ టెండూల్కర్ క్రికెట్ జీవితానికి స్వస్తి పలకనున్న విషయం తెలిసిందె. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ పై విధంగా స్పందించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సచిన్ టెండూల్కర్ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్ స్టేడింయలో జరుగుతున్న 199వ టెస్టు మ్యాచులో ఆడుతున్నాడు.

40ఏళ్ల ఈ ప్రముఖ ఆటగాడు తన క్రికెట్ జీవితంలో ఎన్నో రికార్డులు సాధించాడని, క్రికెట్ జీవితానికి స్వస్తి పలికిన తర్వాత కూడా సచిన్ టెండూల్కర్ జీవితం ఉత్తమంగా ఉండాలని కోరుకుంటున్నట్లు రాహుల్ తెలిపారు. సచిన్ టెండూల్కర్ అంటే తనకు చాలా ఇష్టమని, అతనికి తన శుభాభినందనలు తెలియజేస్తున్నట్లు రాహుల్ చెప్పారు.

English summary
Rahul GandhiCongress vice president Rahul Gandhi, who is also a friend of Sachin Tendulkar, on Thursday congratulated the retiring batting legend on a glorious career, saying he is not only a great cricketer but a good human being also.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X