Sadist: నా తమ్ముడిని మీరే కాపాడండి, డ్రామాలు ఆడిన హకీమ్, మ్యాటర్ లీక్ !
కొచ్చి/పాలక్కాడ్: ఓ యువకుడు అతనికి వరుసకు తమ్ముడు అయ్యే వ్యక్తిని ఆసుపత్రికి పిలుచుకుని వెళ్లాడు. తన తమ్ముడు కేబుల్ ఆపరేటర్ దగ్గర పని చేస్తున్నాడని, ప్రమాదవశాత్తు కిందపడి గాయాలైనాయని వైద్యులకు చెప్పాడు. ఆసుపత్రి సిబ్బంది ఆ యువకుడికి చికిత్స అందించారు. మొదటి నుంచి వైద్యులకు అనుమానం ఉంది. పైనుంచి కిందపడితే ఇలాంటి గాయాలుకావని డాక్టర్లు పసిగట్టారు. చికిత్స విఫలమై ఆ యువకుడు చనిపోయాడు. రంగంలోకి దిగిన పోలీసులకు షాకింగ్ విషయం తెలిసింది.

యువకుడి దగ్గర దూరపు బంధువు
కేరళలోని పాలక్కాడ్ జిల్లాలోని మలయంకాపు ప్రాంతంలో హకీమ్ (27) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. హకీమ్ దగ్గర అతని దూరుపు బంధువు, వరుసకు సోదరుడు అయ్యే హర్షద్ (21) అనే యువకుడు పని చేస్తున్నాడు. చాలాకాలంగా హకీమ్ చెప్పిన పనులు మొత్తం హర్షద్ చేస్తున్నాడు.

ఆసుపత్రిలో డ్రామాలు
గత శుక్రవారం హకీమ్, అతని స్నేహితులు కలసి దూరపు బంధువు హర్షద్ ను ఆసుపత్రికి తరలించారు. తన తమ్ముడు హర్షద్ కేబుల్ ఆపరేటర్ దగ్గర పని చేస్తున్నాడని, ప్రమాదవశాత్తు కిందపడి గాయాలైనాయని వైద్యులకు చెప్పారు. ఆసుపత్రి సిబ్బంది హర్షద్ కు చికిత్స అందించారు. అయితే పైనుంచి కిందపడితే హర్షద్ కు ఇలాంటి గాయాలుకావని, అతని మీద దాడి జరిగిందని డాక్టర్లు పసిగట్టారు

కుక్కలకు ఆలస్యంగా అన్నం పెట్టాడు
వారం రోజుల తరువాత చికిత్స విఫలమై హర్షద్ చనిపోయాడు. ఆసుపత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసుల విచారణలో దిమ్మతిరిగిపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. హకీమ్ కు చాలా కుక్కలు ఉన్నాయని, ప్రతిరోజు హర్షద్ వాటికి అన్నం పెడుతున్నాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

ఎన్ని నాటకాలు ఆడాడు
ఆ రోజుల ఆలస్యంగా కుక్కలకు అన్నం పెట్టాడనే కోపంతో హకీమ్ అతని కుక్కలు కట్టిన బెల్ట్ లు, కర్రలు తీసుకుని అతన్ని చితకబాదేశాడని, ఆ దెబ్బలతోనే హర్షద్ చనిపోయాడని పోలీసులు అన్నారు. హకీమ్ ను అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని పాలక్కాడ్ పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications