Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Sanchar Saathi: ఆ యాప్ మరో పెగాసస్? బిగ్ బాస్ నిఘా- కేంద్రంపై విపక్షాల ఫైర్..!

దేశవ్యాప్తంగా మొబైల్ ఫోన్ ద్వారా పెరిగిపోతున్న సైబర్ నేరాలకు చెక్ పెట్టేందుకు వీలుగా కేంద్ర టెలికాం శాఖ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. సంచార్ సాధీ పేరుతో టెలికాం శాఖ ఓ యాప్ రూపొందించింది. దీన్ని మొబైల్ ఫోన్ లో ఇన్ స్టాల్ చేసుకుంటే స్పామ్ కాల్స్, మెసేజ్ లు, హ్యాకింగ్ ను అడ్డుకుంటుందని తెలిపింది. అలాగే దేశంలో తయారయ్యే మొబైల్ ఫైన్లతో పాటు విదేశాల నుంచి దిగుమతి అయ్యే ఫోన్ల తయారీదారులు సైతం ప్రీలోడ్ చేసి ఇవ్వాలని షరతు పెట్టింది.

దీనిపై ఇప్పుడు వివాదం చెలరేగుతోంది. తాము తయారు చేసే మొబైల్ ఫోన్లలో సంచార్ సాథీ యాప్ ప్రీలోడ్ చేసి అమ్మాలంటూ కేంద్రం పెట్టిన నిబంధనను ఇప్పటికే చాలా కంపెనీలు తిరస్కరించాయి. ఇందులో యాపిల్, శ్యాంసంగ్, జియోమీ వంటి విదేశీ కంపెనీలతో పాటు పలు స్వదేశీ కంపెనీలు కూడా ఈ నిబంధనను అంగీకరించకూడదని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో విపక్షాలు కూడా కేంద్రంపై ఇవాళ విరుచుకుపడ్డాయి.

Sanchar Saathi App Controversy Centre s Order Sparks New Pegasus Spyware Fears

గతంలో పెగాసస్ సాఫ్ట్ వేర్ ను వాడి తమపై నిఘా పెట్టిన కేంద్రం.. ఇప్పుడు మొబైల్ ఫోన్లలో ఇలా సంచార్ సాథీ యాప్ ను ఇన్ స్టాల్ చేయించి తమ సమాచారం తెలుసుకునేందుకు ప్రయత్నిస్తోందని విపక్షాలు మండిపడుతున్నాయి. దీంతో కేంద్రం ఇరుకునపడింది. ఇది పెగాసస్ ప్లస్ ప్లస్ అని కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం ఆరోపించారు. బిగ్ బ్రదర్ మన ఫోన్‌ను, దాదాపు మన మొత్తం ప్రైవేట్ జీవితాలను స్వాధీనం చేసుకుంటాడని విమర్శించారు. కారణం? స్మార్ట్‌ఫోన్ తయారీదారులు తమ పరికరాల్లో రాష్ట్ర-అభివృద్ధి చేసిన సైబర్ సెక్యూరిటీ యాప్ అయిన సంచార్ సాథీ యాప్‌ను తప్పనిసరిగా ముందస్తుగా ఇన్‌స్టాల్ చేసుకోవాలని కేంద్రం ఇచ్చిన ఆదేశమే అన్నారు.

Sanchar Saathi App Controversy Centre s Order Sparks New Pegasus Spyware Fears

నెట్లో యూజర్లు కూడా కేంద్రం ఆదేశాలపై మండిపడుతున్నారు. ప్రభుత్వం ఇప్పుడు అధికారికంగా ప్రజలపై గూఢచర్యం చేస్తోందా అని ప్రశ్నిస్తున్నారు. పన్ను చెల్లింపుదారులకు ఇది డబ్బు ఆదా చేస్తుందా అని అడుగుతున్నారు. పెగాసస్ ఒక పాపులారిటీకి $10 వేల లాంటిదని, అలాగే జియోనిస్ట్ టెర్రర్‌కు నిధులు సమకూరుస్తుందని విమర్శిస్తున్నారు. ఇది వికసిత్ భారత్‌లో నిజమైన స్వదేశీ నిఘా అనే ఆరోపణలు చేస్తున్నారు. ఇదే క్రమంలో రాజ్యసభ ఎంపీ ప్రియాంక చతుర్వేది.. ప్రతి మొబైల్ ఫోన్ తయారీదారుకు శాశ్వత మొబైల్ ఫీచర్‌గా ప్రభుత్వం సంచార్ సాథి మొబైల్ అప్లికేషన్‌ను తప్పనిసరి చేయడం మరొక బిగ్ బాస్ నిఘా క్షణం తప్ప మరొకటి కాదన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+