Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

శశికళ పుణ్యమాని చెత్త పేరు మూటగట్టుకున్న 'గోల్డెన్ బే రిసార్ట్'

పొలిటికల్ మాఫియా గ్రూపులకు ఆశ్రయమిచ్చే ఈ రిసార్టు పర్యాటకులకు ఎంతమేర సురక్షితమో చెప్పండని నెటిజెన్స్ ప్రశ్నిస్తున్నారు.

చెన్నై: అన్నాడీఎంకె ప్రధాన కార్యదర్శి శశికళ పుణ్యమాని గోల్డెన్ బే రిసార్టు కాస్త చెత్త రిసార్టుగా విమర్శలు ఎదుర్కొంటుంది. పొలిటికల్ మాఫియాకు ఆశ్రయం ఇవ్వడంతో పాటు, హోటల్ యాజమాన్యం ఇందులో అక్రమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారంటూ నెటిజెన్స్ తమ అక్కసు వెళ్లగక్కుతున్నారు.

ఫలితంగా గూగుల్ లో ఈ రిసార్టుకు అన్ని నెగటివ్ రేటింగ్స్ వస్తుండటం గమనార్హం. పొలిటికల్ మాఫియా గ్రూపులకు ఆశ్రయమిచ్చే ఈ రిసార్టు పర్యాటకులకు ఎంతమేర సురక్షితమో చెప్పండని నెటిజెన్స్ ప్రశ్నిస్తున్నారు. మరోవైపు స్థానిక ప్రజలు కూడా రిసార్టు యాజమాన్యం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Sasikala effect: Golden Bay resort ratings pulled down on Google

కాగా, వారానికి పైగా సాగిన తమిళనాడు పొలిటికల్ డ్రామాలో గోల్డెన్ బే రిసార్టు నిత్యం వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ఆఖరికి చిన్నమ్మ శశికళ సైతం రిసార్టుకు వచ్చి ఎమ్మెల్యేలతో మంతనాలు జరిపారు. ఎమ్మెల్యేలను కాపాడుకోవడం కోసం చిన్నమ్మ మన్నార్ గుడి మాఫియాను దించారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.

ఏదేమైనా ఎమ్మెల్యేలను కాపాడుకోవడంలో గోల్డెన్ బే రిసార్టు శశికళకు కలిసిరాగా.. రిసార్టుకు మాత్రం చెడ్డ పేరు వచ్చిందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+