గుజరాత్ రాష్ట్రాన్ని కవర్ చేసేంత పెద్దదిగా బిపర్ జోయ్ తీవ్రత; షాకింగ్ శాటిలైట్ చిత్రాలు!!
అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపర్ జోయ్ తుఫాను గుజరాత్ రాష్ట్రంలో తీరాన్ని తాకింది. బిపర్ జోయ్ తుఫాన్ గుజరాత్ తీరంలో పెను విధ్వంసాన్ని సృష్టించింది. గురువారం అర్ధరాత్రి వరకు తుఫాను ల్యాండ్ ఫాల్ కొనసాగనుంది. బిపర్ జోయ్ ప్రభావంతో గుజరాత్ తీర ప్రాంతంలో గంటకు 120 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కొనసాగనున్నాయి.
లోతట్టు ప్రాంతాల ప్రజలను, తుఫాను ప్రభావిత ప్రాంతాలకు చెందిన లక్షలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి బిపర్ జోయ్ తుఫాన్ తీవ్రత చిత్రాలు తీశారు. ఇప్పుడు ఆ చిత్రాలు గుజరాత్ రాష్ట్రాన్ని మొత్తం కవర్ చేసేంత పెద్దవిగా తుఫాను తీవ్రత చూపిస్తున్నట్లుగా కనిపిస్తుంది. గుజరాత్ రాష్ట్రం దేశంలోనే ఐదవ అతిపెద్ద రాష్ట్రంగా పరిగణించబడుతుంది.

మొత్తం గుజరాత్ రాష్ట్రం ఒక లక్ష 96 వేల కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. అత్యంత తీవ్రమైన తుఫాను అయిన బిపర్ జోయ్ దాదాపు పది రోజుల పాటు సముద్రంలో అల్లకల్లోలం సృష్టించి అత్యధిక కాలం కొనసాగిన తుఫానుగా రికార్డును సృష్టించింది. భారత వాతావరణ శాఖ తీసిన ఉపగ్రహ చిత్రాలు బిపర్ జోయ్ తుఫాను ఎంత పెద్దదో.. తేటతెల్లం చేస్తుంది.
Cyclone Biparjoy is nearing western India and southern Pakistan after stirring in the Arabian Sea for over a week. Warm sea surface temperatures contributed to the cyclone’s unusually long lifespan. @NOAA-20 captured this image on June 14. https://t.co/5jWQq4umNC pic.twitter.com/qZt7gUQ4zi
— NASA Earth (@NASAEarth) June 15, 2023
INSAT అందించిన ఉపగ్రహ చిత్రాలు తుఫాను బీభత్సాన్ని అర్థమయ్యేలా చెప్తున్నాయి .ఈ ఫొటోలు తుఫాను యొక్క పూర్తి శక్తిని మరియు తీవ్రతను నొక్కి చెబుతున్నాయి. బిపర్ జోయ్ ప్రభావంతో గుజరాత్ లోని ద్వారక, జామ్ నగర్, పోర్ బందర్, రాజ్ కోట్, మోర్బి, జునాగడ్,ఆమ్రేలి, భావ్ నగర్, గిర్ సోమనాథ్ జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
18 ఎన్డీఆర్ఎఫ్, 12 ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు రోడ్లు భవనాల శాఖకు చెందిన 115 బృందాలు, విద్యుత్ శాఖకు చెందిన 397 బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. బిపర్ జోయ్ తుఫాను నేపధ్యంలో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఇండియన్ కోస్ట్ గార్డ్ దళాలను కూడా అప్రమత్తం చేశారు.












Click it and Unblock the Notifications