గుండు అంకుల్ .. బ్యాంకులో ఏంటా ఆ పని..!

బ్యాంకు ఉద్యోగులంటే క్షణం తీరిక లేకుండా కస్టమర్ సేవల్లో మునిగి తేలేవారే గుర్తొస్తారు. పని ఒత్తిడి, ఫైల్స్ మధ్య బిజీగా ఉండే వారికి రొమాన్స్, సరదాలు అనేవి సినిమాల్లో మాత్రమే కనిపిస్తాయి. అలాంటిది, దేశంలోనే అతిపెద్ద బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కార్యాలయంలోని ఓ ఉద్యోగి చేసిన పని ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద రచ్చకు దారి తీసింది.

ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్‌గా మారిన రీల్స్ మోజు, ఏకంగా ఒక ప్రభుత్వ రంగ బ్యాంక్ బ్రాంచ్ ఆఫీస్‌లోకి చొచ్చుకు వచ్చింది. వైరల్ అవుతున్న వీడియోలో, బ్రాంచ్ మేనేజర్ అలోక్ కుమార్ తన డెస్క్‌పై కంప్యూటర్, ఫైల్స్ పెట్టుకొని పని చేస్తుండగా... ఓ మహిళా ఉద్యోగి ఆయన చుట్టూ తిరుగుతూ బాలీవుడ్ పాట 'సారా సారా దిన్ తుం కామ్ కరోగే తో ప్యార్ కబ్ కరోగే' పాటకు రీల్ డ్యాన్స్ చేస్తూ కనిపించింది.

SBI Branch Office Dance Reel Goes Viral

పని తీవ్రత, రొమాన్స్ మధ్య ఉండే వ్యత్యాసాన్ని హైలైట్ చేసేలా ఉన్న ఈ వీడియో, ఇండియన్ బ్యాంకింగ్ సర్కిల్స్‌లో ఒక హాట్ టాపిక్‌గా మారింది. వీడియో బ్యాక్‌గ్రౌండ్‌లో అవార్డుల ట్రోఫీలు కూడా కనిపించడం, వృత్తిపరమైన వాతావరణంలో జరిగిన ఈ రీల్ డ్యాన్స్‌కు మరింత పబ్లిసిటీని తెచ్చిపెట్టింది.

ఈ వీడియో సోషల్ మీడియాలో అప్‌లోడ్ అయిన వెంటనే, నెటిజన్ల నుండి రకరకాల స్పందనలు వచ్చాయి.కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు "బ్రదర్ త్వరలో సస్పెండ్ అవుతాడు" అంటూ తమ సెటైరికల్ కామెంట్స్‌తో హెచ్చరించారు. మరికొందరు పబ్లిక్ సర్వీస్ కార్యాలయాల్లో ఇలాంటి ఎంటర్‌టైన్‌మెంట్ అవసరమా అంటూ "ప్రభుత్వ ఆఫీసులు ఎంటర్‌టైన్మెంట్ కోసం ఉన్నాయా?" అని ప్రశ్నించారు.ఇంకొందరు ప్రేమ పక్షులకు మద్దతుగా "వాళ్లు లవ్ బర్డ్స్... వాళ్లను సస్పెండ్ చేయకండి" అంటూ ఉన్నతాధికారులను ఉద్దేశించి కామెంట్స్ పెట్టారు.

ఏది ఏమైనప్పటికీ, పని వేళల్లో, అదీ బ్యాంకు ఆఫీస్ లాంటి అధికారిక ప్రదేశంలో చేసిన ఈ వీడియో, సోషల్ మీడియా ట్రెండ్‌ల పట్ల ఉద్యోగులు ఎంతవరకు నియంత్రణ పాటించాలనే ప్రశ్నను మరోసారి తెరపైకి తెచ్చింది. SBI యాజమాన్యం ఈ వీడియోపై ఎలా స్పందిస్తుందో, ఉద్యోగిపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందో అనే ఉత్కంఠ నెలకొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+