షాక్:వచ్చే 2 ఏళ్ళలో 10% తగ్గనున్న ఎస్బీఐ ఉద్యోగులు, రిక్రూట్ మెంట్ కూడ తక్కువే

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్ బి ఐ ఉద్యోగులను తగ్గించనుంది. మరో రెండేళ్ళలో 10 శాతం ఉద్యోగులను తొలగించనున్నట్టు ఎస్ బి ఐ ఎండీ రాజ్ నీశ్ కుమార్ చెప్పారు.

ఎస్ బి ఐలో ఇప్పటికే 2,07,000 మంది ఉద్యోగులున్నారు. ఏప్రిల్1వ, తేదిన ఎస్ బి ఐ మరో ఆరు సంస్థలను అనుబంధం చేసుకోనుంది.

sbi

దీంతో మొత్తం ఉద్యోగుల సంఖ్య 2,77,000 లకు పెరగనుంది.ఈ నేపథ్యంలో అనుబంధ సంస్థల కారణంగా కొత్త సమస్యలు రాకుండా మార్చి 2019 నాటికి పది శాతం ఉద్యోగులను తొలగించాలని ఆ సంస్థ భావిస్తున్నట్టు ఆ సంస్థకు చెందిన ఉన్నత ఉద్యోగులు చెప్పారు.

సంస్థల అనుబంధం తరవాత జరగబోయే పరిణామాలను బట్టి మిగిలిన మార్పులు జరుగుతాయని సంస్థ ఉన్నతవర్గాలు అభిప్రాయపడ్డాయి.

ఎస్ బీ ఐ లో కొత్త ఉద్యోగులను తీసుకోవడమనేది 50 శాతం తగ్గే అవకాశం ఉందని ఎస్ బి ఐ లోని ఉన్నతవర్గాలు చెప్పాయి.

ప్రతి ఏటా ఐదు వేల నుండి ఆరువేలమందిని తీసుకొంటున్నామని అయితే రానున్న రోజుల్లో ఇది యాభై శాతానికి తగ్గే అవకాశం ఉందని చెప్పారు. అంతే కాకుండా ఎస్ బి ఐ శాఖల విస్తీర్ణం కూడ చేయనున్నామని ఏటా కొత్త బ్రాంచీలను తెరుస్తూనే ఉంటామని ఎస్ బి ఐ లోని ఉన్నత వర్గాలు వెల్లడించాయి.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
sbi total workforce will see a reduction over the next two years, after the merger with six entities.
Please Wait while comments are loading...