గుజరాత్ హైకోర్టులో ఏం జరుగుతోంది ? సుప్రీంకోర్టు ఫైర్- తీవ్ర వ్యాఖ్యలు..!

మన దేశంలో కింది కోర్టులు ఇచ్చిన తీర్పుల్ని సవరించి పైకోర్టులు తీర్పులు ఇవ్వడం చూస్తూనే ఉన్నారు. అలాగే కింది కోర్టులు ఇచ్చిన తీర్పుల్ని సమర్ధిస్తూ పైకోర్టులు ఉత్తర్వులు ఇవ్పడం కూడా చూశాం. కానీ గుజరాత్ హైకోర్టు మాత్రం గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు భిన్నంగా మరో తీర్పు ఇచ్చి వివాదంలో చిక్కుకుంది. ఈ వ్యవహారం కాస్తా సుప్రీంకోర్టులో విచారణకు రావడంతో అత్యున్నత న్యాయస్ధానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఇంతకీ ఏం జరిగిందంటే...ఓ అత్యాచార బాధితురాలు తన గర్భాన్ని తొలగించుకోవడానికి అనుమతి కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన గుజరాత్ హైకోర్టు దీన్ని తోసిపుచ్చింది. దీనిపై ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్ధానం పలు కీలక అంశాల్ని ప్రస్తావించింది. ముఖ్యంగా గతంలో తాము చేసిన తీర్పుకు వ్యతిరేకంగా గుజరాత్ హైకోర్టు తీర్పు ఇవ్వడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది.

sc raps gujarat high court over order against its past verdict

గుజరాత్ హైకోర్టులో ఏం జరుగుతోందని ఈ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రశ్నించింది. భారతదేశంలోని ఏ కోర్టు కూడా ఉన్నత న్యాయస్థానం ఆదేశాలకు వ్యతిరేకంగా ఉత్తర్వులు ఇవ్వదు. ఇది రాజ్యాంగ తత్వశాస్త్రానికి కూడా విరుద్ధమని జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. రేప్ బాధితురాలు గర్భం తొలగించుకోవడానికి గుజరాత్ హైకోర్టు నిరాకరించడంపై సుప్రీం ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది.

గుజరాత్ ప్రభుత్వం తరపున వాదిస్తున్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. కేవలం క్లరికల్ ఎర్రర్ సరిదిద్దేందుకే హైకోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసిందని సుప్రీంకోర్టుకు తెలిపారు. హైకోర్టు గత ఆదేశాల్లో క్లరికల్ లోపం ఉందని, అది తాజాగా పరిష్కరించినట్లు పేర్కొన్నారు. ఇది కేవలం అపార్థం వల్లేనన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ ఆదేశాలు వెనక్కి తీసుకోవాలని హైకోర్టును కోరతామన్నారు. దీనిపై మండిపడిన సుప్రీంకోర్టు.. అత్యాచార బాధితురాలి పిటిషన్ పై నిర్ణయం తీసుకోవడంలో హైకోర్టు చేసిన జాప్యంతో ఆమె విలువైన సమయం వృథా అయిందని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. హైకోర్టు అలసత్వాన్ని తప్పుబడుతూ సుప్రీం కోర్టు గుజరాత్ ప్రభుత్వంతో పాటు ఇతరులకూ నోటీసులు జారీ చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+