అమ్మాయిలకు ప్రిన్సిపల్ లైంగిక వేధింపు, మరో లేడీ టీచర్...
రాయ్‌పుర్: విద్యార్థినులను లైంగికంగా వేధిస్తున్న 36 ఏళ్ల ప్రభుత్వం పాఠశాల హెడ్మాస్టర్‌ను పోలీసులు మంగళవారం సాయంత్రం అరెస్టు చేశారు. ఈ సంఘటన రాజధానిలోని సరోరా ప్రాంతంలో జరిగిందని పోలీసులు తెలిపారు. ఉర్లా పోలీసు స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్‌హెచ్ఓ) మీనా చౌదరి ఈ విషయం చెప్పారు.
పాఠశాలలో చదువుతున్న మైనర్ బాలికలు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. స్కూల్ హెడ్మాస్టర్ పేరు అరవింద్ తివారి. అతను ఖైరాగర్‌కు చెందిన వారు. అతను డీడీ నగర్‌లో ఉంటున్నాడు.

ఇంగ్లీష్ చెప్పే ఈ హెడ్మాస్టర్ తమ పట్ల నిత్యం మిస్ బిహేవ్ చేస్తున్నాడని పలువురు బాలికలు ఫిర్యాదు చేశారని ఎస్‌హెచ్‌ఓ తెలిపారు. ఫిర్యాదులు ఎక్కువగా తొమ్మిదో తరగతి విద్యార్థుల నుండి అందినట్లుగా చెప్పారు.
విద్యార్థులు పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం.. తివారికి అదే పాఠశాలలోని మరో మహిళా ఉపాధ్యాయురాలితో సంబంధం ఉంది. ఈ విషయాన్ని పోలీసులకు చెప్పేందుకు ఆమె సహకరించినట్లుగా తెలుస్తోంది.
ఈ విషయాన్ని విద్యార్థులు మొదట తమ తల్లిదండ్రులకు చెప్పారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తివారి పైన ఐపీసీ సెక్షన్ 354(ఏ) (లైంగిక వేధింపులు), పోస్కో తదితర సెక్షన్ల కింద్ కేసు నమోదు చేశారు. కేసును విచారిస్తున్నారు.












Click it and Unblock the Notifications