స్క్రాప్ స్పెషల్: ప్రపంచంలోనే అతిపెద్ద రుద్రవీణ; ఓ లుక్కెయ్యండి!!

రుద్రవీణ.. సంగీత వాయిద్యాలలో అందులోనూ ముఖ్యంగా వీణలలో ప్రత్యేకంగా ఉండే వాయిద్య పరికరం రుద్రవీణ. వీణ గొప్పతనం తెలిసిన వారికి రుద్రవీణకు ఉండే ప్రత్యేకత కచ్చితంగా తెలుసు. అటువంటి రుద్రవీణ ను చాలా స్పెషల్ గా తయారు చేశారు మధ్యప్రదేశ్ రాజధాని అయిన భోపాల్లోని కళాకారుల బృందం. ఇక వారు 10 లక్షల రూపాయలు వెచ్చించి ఎంతో కష్టపడి తయారుచేసిన రుద్రవీణ కు ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఇక ఆ ప్రత్యేకతలపై ఓ లుక్కేయండి.

 ఐదు టన్నుల బరువున్న స్క్రాప్ తో అద్భుతమైన రుద్రవీణ

ఐదు టన్నుల బరువున్న స్క్రాప్ తో అద్భుతమైన రుద్రవీణ

మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లోని కళాకారుల బృందం ఐదు టన్నుల బరువున్న స్క్రాప్ తో అద్భుతమైన రుద్రవీణ ను రూపొందించింది. 28 అడుగుల పొడవు, 10 అడుగుల వెడల్పు, 12 అడుగుల ఎత్తులో ఉన్న ఈ రుద్రవీణను 15 మంది కళాకారులు డిజైన్ చేసి మనకు పనికిరాని వస్తువులతో అద్భుతంగా తయారుచేసింది. దీని కోసం 10 లక్షల రూపాయలను ఖర్చు చేసింది కళాకారుల బృందం. ఆరు నెలల పాటు కళాకారులు ఎంతో కష్టపడి రూపొందించిన ఈ రుద్రవీణ ఐదు టన్నుల బరువు ఉంది.

 ప్రరంచంలోనే అతి పెద్ద రుద్రవీణ

ప్రరంచంలోనే అతి పెద్ద రుద్రవీణ


ఇప్పటి వరకు దేశంలో తయారుచేసిన రుద్రవీణలలో ఇదే అతిపెద్ద రుద్రవీణ అని భావిస్తున్నారు. ఇది కేవలం భోపాల్లో మాత్రమే కాకుండా ప్రపంచంలోని అతి పెద్ద రుద్రవీణ అని చెబుతున్నారు. ముఖ్యంగా చెత్తతో, ఎందుకూ పనికిరాని వస్తువులతో రూపొందించిన ఈ రుద్రవీణ భారతీయ సంస్కృతీ వారసత్వానికి ప్రతీకగా ఉంటుందని తయారీదారులు చెబుతున్నారు. ఇనుప చైన్లు, గేర్లు, బాల్ బేరింగ్లు వంటి పనికిరాని వాహనాల విడిభాగాలతో, తీగలతో రుద్రవీణ ను అద్భుతంగా వారు తయారు చేశారు.

 భారతదేశ సంస్కృతి, వారసత్వాన్ని తెలిపే ప్రయత్నం

భారతదేశ సంస్కృతి, వారసత్వాన్ని తెలిపే ప్రయత్నం


భారతదేశ సంస్కృతి, గొప్పతనాన్ని తెలుసుకోవడం కోసం భారతీయ నేపధ్యం పై పని చేయాలనుకుంటున్న క్రమంలో రుద్రవీణ ను రూపొందించినట్టు కళాకారులు తెలిపారు. ఈ రుద్రవీణను ఏర్పాటు చేయడానికి భోపాల్లో అటల్ పాథ్ లో ఒక స్థలాన్ని గుర్తించినట్టు, అందులో మ్యూజికల్ సిస్టమ్, లైట్ లను కూడా ఏర్పాటు చేసి దానిని మరింత అందంగా తీర్చిదిద్దుతున్నట్టు తయారుచేసిన కళాకారులు చెబుతున్నారు. చెత్త నుండి స్వర్ణం బయటకు తీయవచ్చు అన్న కాన్సెప్టుతో ఈ వీణ ను తయారు చేసినట్టుగా వారు చెబుతున్నారు. ఎవరైనా భోపాల్ కి వెళితే కళాకారులు ఎంతో అందంగా తీర్చిదిద్దిన ఈ రుద్రవీణతో ఖచ్చితంగా సెల్ఫీలు తీసుకోవటం మాత్రం పక్కా అంత అద్భుతంగా ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+