వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోటికి 25లక్షల కమిషన్ : బ్లాక్‌ను వైట్ చేసే దందా!

భరత్ షా అనే వ్యాపారవేత్త తన వద్ద ఉన్న రూ.కోటి పాత నోట్లను మార్పిడి చేసుకునేందుకు ఏజెంట్లను ఆశ్రయించాడు. రూ.25లక్షల కమిషన్ మేరకు బ్లాక్ ను వైట్ గా చేసేందుకు ఇద్దరి మధ్య ఒప్పందం కుదిరింది.

|
Google Oneindia TeluguNews

పుణే : నోట్ల రద్దు నిర్ణయంతో కోట్ల కొద్ది పోగేసుకున్న డబ్బును ఎలా మార్పిడి చేసుకోవాలో తెలియక నల్లకుబేరులు తలపట్టుకుంటున్నారు. ఇదే అదునుగా భావించి కొంతమంది ఏజెంట్ల అవతారం ఎత్తుతుండడంతో.. కమిషన్ల ప్రాతిపదికన బ్లాక్ ను వైట్ గా మార్చే దందాలు అక్కడ వెలుగుచూస్తున్నాయి.

Bharat

తాజాగా పుణేలో ఇలాంటి ఘటనే వెలుగుచూసింది. భరత్ షా అనే వ్యాపారవేత్త తన వద్ద ఉన్న రూ.కోటి పాత నోట్లను మార్పిడి చేసుకునేందుకు ఏజెంట్లను ఆశ్రయించాడు. రూ.25లక్షల కమిషన్ మేరకు బ్లాక్ ను వైట్ గా చేసేందుకు ఇద్దరి మధ్య ఒప్పందం కుదిరింది. పుణేలో ఎంజీరోడ్డులో వీరు కలుసుకోవడానికి ప్రయత్నిస్తుండగా.. అకస్మాత్తుగా పోలీసులు దాడులు చేశారు.

దాడుల్లో మొత్తం రూ.1.12కోట్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఇందులో రూ.500నోట్లు బ, రూ.100నోట్లు 28 ఉన్నట్టు గుర్తించారు. కాగా, ఈ డబ్బంతా తన కష్టార్జితమేనని, పొదుపు చేసుకున్న డబ్బు అని భరత్ వాదిస్తున్నాడు.

English summary
Police Friday seized cash worth Rs 1.12 crore, all in banned denominations of Rs 500 and Rs 1000 from a businessman in Pune. According to Lashkar Police Station, the businessman, Bharat Shah,
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X