వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అల్ ఖోరసన్ పిడుగు: భారత్‌కు మరింత దగ్గరగా ఐసిస్.. ఎలా?

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఐసిస్ ఉగ్రవాదం ప్రభావం ఇప్పటి వరకు భారత్ పైన ఎక్కువగా పడలేదనే చెప్పవచ్చు. అయితే, భారత్ నుండి భారీ రిక్రూట్మెంట్లు లక్ష్యంగా ఐసిస్ చేసుకుందని భారత నిఘా వర్గాలు చెబుతున్నాయి. భారత్ పైన ఐసిస్ కన్నును ఇంటెలిజెన్స్ వర్గాలు, కేంద్ర హోంశాఖ నిఘా వేసి ఉంచాయి.

సిరియా, ఇరాక్‌లలో ఐసిస్ ఉగ్రవాదం ఎలాంటి బీభత్సం సృష్టిస్తుందో తెలిసిందే. ఇప్పుడు ఐసిస్ ఆప్ఘనిస్తాన్‌కు కూడా నేరుగా చొచ్చుకు వచ్చింది. ఇక్కడ తాలిబన్ హవా బాగా ఉంది. ఇలాంటి ప్రాంతానికి ఐసిస్ కూడా చొచ్చుకు వచ్చింది.

ప్రతి నెల మూడు వందల నుండి ఐదు వందల మంది వరకు చేర్చుకోవాలని ఐసిస్ టార్గెట్‌గా పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది. ఐసిస్ ఆప్ఘనిస్తాన్ రాక భారత్‌కు కూడా ఆందోళనకరమేనని చెప్పవచ్చు. ఐసిస్ తిష్టవేసిన కాబుల్ దక్షిణ ప్రాంతం మన దేశ రాజధాని న్యూఢిల్లీకి 800 నుండి 1000 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

See how close the ISIS is to India today

దీంతో భారత్ మరింత అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉందని అంటున్నారు. గతంలో సిరియా, ఇరాక్‌లలో ఐసిస్ ఉన్న సమయంలోనే మన దేశం నుండి కొంతమంది యువత దాని వైపు ఆకర్షితులు అయినట్లుగా కనిపించింది. అంత దూరంలో ఉన్నప్పుడే ఐసిస్‌లో చేరేందుకు ఇంటిని విడిచి పెట్టిన వారు ఉన్నారు.

ఇప్పుడు ఐసిస్ భారత్‌కు దగ్గరగా (ఆఫ్ఘనిస్తాన్) వచ్చింది. దీంతో మన యువతను ఆకర్షించేందుకు దానికి మరింత అవకాశం ఉంటుందనే వాదనలు వినిపిస్తున్నాయి. దీనిపై తాము అప్రమత్తంగా ఉన్నామని, ప్రతి విషయాన్ని క్లోజ్‌గా వాచ్ చేస్తున్నామని నిఘా సంస్థలు చెబుతున్నాయి.

ఆల్ ఖోరసన్

ఐసిస్ ఇటీవలే ఆప్ఘనిస్తాన్‌లో కార్యకలాపాలు ప్రారంభించింది. దానికి అల్ ఖోరసన్ అని పేరు పెట్టుకున్నారు. సిరియా, ఇరాక్‌లలో పోరాటం చేస్తున్న ఐసిస్.. ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలని ఉవ్వీళ్లూరుతోంది. అందులో భాగంగానే ఆప్ఘనిస్తాన్‌లో అల్ ఖోరసన్‌తో వచ్చింది.

ఇప్పటికే ఆప్ఘనిస్తాన్‌లో తెహ్రిక్ తాలిబన్, అల్ ఖైదా, తాలిబన్, ఇతర సంస్థలు ఉన్నాయి. వాటికి ఇప్పుడు ఐసిస్ లేదా అల్ ఖోరసన్ తోడయింది. జిహాద్ మూవ్‌మెంట్‌ను తాలిబన్లు ఏకీకృతం చేయడంలో విఫలమవుతున్నారని ఐసిస్ భావిస్తోంది. దీంతో దానిని కూడా ఆప్ఘన్‌లో ఐసిస్ టార్గెట్ చేసింది.

అయితే, తమ అధినేత ముల్లా ఓమర్ తాలిబన్‌ను మళ్లీ ఉత్తేజితం చేస్తారని తాలిబన్లు భావిస్తున్నారు. కారణాలేవైనా, ప్రస్తుతం మతతత్వవాదులు ఐసిస్ వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఐసిస్ ఆర్థికంగా నిలదొక్కుకుందని సమాచారం. తాలిబన్లకు మాత్రం విరుద్ధంగా ఉందని తెలుస్తోంది.

English summary
India may not be badly affected by the ISIS, but the recruitments that are taking place in full scale in its backyard is something that the Indian Intelligence Agencies and the Home Ministry is watching closely.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X