కారులో కామపిశాచం: సీరియల్ రేపిస్ట్ అరెస్టు
చెన్నై: మహిళలపై వరుసగా అత్యాచారా లు చేస్తు తప్పించుకుని తిరుగుతున్న నిందితుడిని చెన్నయ్ నగర పోలీసులు అరెస్టు చేశారు. తోరైపాకంలో నివాసం ఉంటున్న సురేష్ కుమార్ అలియాస్ సురేష్ (35) అనే కామాంధుడిని అరెస్టు చేశారు.
పోలీసు అధికారి నెలకరాజ్ కథనం మేరకు వివరాలు ఈ విదంగా ఉన్నాయి. ఇతను ట్రావెల్ ఏజెన్సీలో కారు డ్రైవర్ గా పని చేస్తున్నాడు. ఇతనికి మధ్య వయస్సు ఉన్న మహిళలు అంటే పిచ్చి. వారి మీద అత్యాచారం చెయ్యడానికి తన కారునే ఉపయోగించుకుంటున్నాడు.
గత శనివారం 49 సంవత్సరాల వయస్సు ఉన్న మహిళ రెసిడెన్సియల్ కాలనీలో నడిచి వెళుతున్నది. ఆ సమయంలో సురేష్ కారులో అటువైపు వెళ్లాడు. తరువాత ఆమెను పలకరించాడు. తమ యజమాని చీరలు పంపిణి చేస్తున్నాడని, వచ్చి తీసుకొవాలని ఆమెను నమ్మించాడు.

మాయమాటలు చెప్పి ఆమెను కారులో పిలుచుకుని వెళ్లాడు. తరువాత ఈస్ట్ కాస్ట్ రోడ్డులో కారు పార్క్ చేసి అమెతో అసభ్యంగా ప్రవర్థించాడు. ఎదురు తిరిగిన ఆమె మీద కత్తితో దాడి చేసి కారులోనే రేప్ చేశాడు. చివరికి ఆమెను కారులో నుండి బయటకు తోసేసి పరారైనాడు.
బాధితురాలు సురేష్ కారు నెంబర్ నోట్ చేసుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు విచారణ చెయ్యగా ఆ కారు ట్రావెల్ ఏజెన్సీకి చెందినదని గుర్తించారు. పోలీసులు విచారణ చేసి సురేష్ ను అరెస్టు చేశారు. నిందితుడు విచారణలో పలు విషయాలను అంగీకరించాడు.
గతంలో తాను తోరైపాకం, తిరువనామియూర్ ప్రాంతాలలో నలుగురు మహిళలను రేప్ చేసినట్లు సురేష్ అంగీకరించాడని పోలీసులు అన్నారు. మధ్య వయస్సు ఉండి, ఆర్థికస్థోమత లేనివారిని సురేష్ టార్గెట్ చేసుకుంటున్నాడని, ఇతను ఇంకా ఎంత మందిని రేప్ చేశాడు అని వివరాలు సేకరిస్తున్నామని చెన్నయ్ పోలీసు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications