100 మంది అమ్మాయిలు, ఆంటీలకు వల, కామాంధుడు, నగ్న వీడియోలతో బ్లాక్ మెయిల్, పాపం లేడీ డాక్టర్!
చెన్నై: అందమైన అమ్మాయిలు, ఆంటీలకు సోషల్ మీడియాలో పరిచయం పెంచుకుని వారికి వల వేసి శారీరక సుఖంతో వారిని దగ్గర చేసుకుని రహస్యంగా నగ్న వీడియోలు, ఫోటోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తున్న కామాంధుడిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రముఖ లేడీ డాక్టర్ ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చెయ్యడంతో ఈ కామాంధుడి అసలు స్వరూపం బయటపడింది.
ఇప్పటి వరకు 100 మందికిపైగా అమ్మాయిలు, ఆంటీలను ఇతను శారీరకంగా అనుభవించి వారిని బ్లాక్ మెయిల్ చేసి రూ. లక్షలు వసూలు చేశాడని వెలుగు చూడటంతో పోలీసులు షాక్ కు గురైనారు. కామాంధుడు ఎలా అమ్మాయిలను మోసం చేస్తున్నాడో అనే విషయంపై ప్రముఖ మహిళా న్యాయవాది చిన్మయి శ్రీపాద సైతం అతని మీద ఇప్పుడు పోరాటం చేస్తున్నారు.

తండ్రి ఫేమస్ చికెన్ వ్యాపారి
తమిళనాడులోని నాగర్ కోవిల్ లోని గణేషపురం ప్రాంతంలో నివాసం ఉంటున్న తంగపాండియన్ అనే వ్యక్తి హోల్ సేల్ చికెన్ వ్యాపారం చేస్తూ భారీ మొత్తంలో డబ్బులు సంపాధిస్తున్నాడు. తంగపాండియన్ కుమారుడు కాశీ అలియాస్ సుజి అలియాస్ బాబు (26). తండ్రి తంగపాండియన్ సంపాధిస్తున్న డబ్బుతో కాశీ విచ్చలవిడిగా ఎంజాయ్ చేస్తున్నాడు. కాశీ మాత్రం ఎలాంటి వ్యాపారాలు, ఉద్యోగం చెయ్యడం లేదు.

కండలు పెంచి అమ్మాయిలు, ఆంటీలకు వల
కాశీ ప్రతిరోజు జిమ్ కు వెళ్లి కండలు పెంచుతున్నాడు. ఇలా కండలు పెంచిన శరీరంతో ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నాడు. ఫేస్ బుక్ ఇన్ స్ట్రా గామ్, వాట్సాప్ తదితర గ్రూప్స్ లో కాశీ అతని నిజమైన ఫోటోలతో పాటు నకిలీ ఫోటోలు పోస్టు చేసి అమ్మాయిలు, ఆంటీలతో పరిచయం పెంచుకున్నాడు. ఎప్పుడు చిత్తకార్తి కుక్కలా వారి వెంటపడ్డాడు.

నగ్న వీడియోలు, ఫోటోలు
అమ్మాయిలతో పరిచయం పెంచుకున్న కాశీ తరువాత వారిని రహస్య ప్రాంతాలకు పిలుచుకుని వెళ్లి వారితో రాసలీలలు సాగించాడు. రాసలీలలు సాగిస్తున్న సమయంలో అమ్మాయిలు, ఆంటీల నగ్న ఫోటోలు, వీడియోలు తీశాడు. అమ్మాయిలు, ఆంటీలతో ఎప్పుడూ ఎక్కడికి పడితే అక్కడికి వెళ్లి ఇంతకాలం ఎంజాయ్ చేశాడు.

చెన్నై లేడీ డాక్టర్ బలి
చెన్నైలోని ప్రముఖ ఆసుపత్రిలో పని చేస్తున్న మహిళా డాక్టర్ సైతం ఇన్ స్ట్రా గామ్ లో కాశీ కండలు చూసి అతనికి దాసోహం అయ్యి కాశీ వలలో పడింది. ఆ లేడీ డాక్టర్ తో రాసలీలలు సాగిస్తున్న సమయంలో ఆమె నగ్న ఫోటోలు, వీడియోలు తీసి ఆమెను బ్లాక్ మెయిల్ చేసి భారీ మొత్తంలో రూ. లక్షల రూపాయలు వసూలు చేశాడు. ఎక్కడ పరువు పోతుందో అని ఆమె కాశీ అడిగినంత డబ్బులు ఇస్తూ వచ్చింది. అయితే కాశీ ఆగడాలు ఎక్కువ కావడంతో విసుగు చెందిన మహిళా డాక్టర్ ఏమైతే అదికాని అంటూ కాశీ మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు.

వామ్మో వంద మందితో రొమాన్స్
లేడీ డాక్టర్ ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు కాశీని అరెస్టు చేసి విచారణ చేశారు. తాను ఇంతకాలం ఫేస్ బుక్, ఇన్ స్ట్రా గామ్, వాట్సాప్ తదితర సోషల్ మీడియా గ్రూప్స్ లో సుమారు వంద మందికి పైగా అమ్మాయిలు, ఆంటీలకు వలవేశానని కాశీ అంగీకరించడంతో పోలీసులు షాక్ కు గురైనారు. కాశీ ఎంత కామాంధుడో, కాలాంతకుడో తెలుసుకున్న పోలీసుల దిమ్మతిరిగిపోయింది.

ల్యాప్ టాప్ లు, మొబైల్స్, హార్డ్ డిస్క్ ల్లో?
కాశీ ఇచ్చిన సమాచారం మేరకు అతని స్నేహితుల జాబితాను పోలీసులు సిద్దం చేశారు. కాశీ ప్రాణ స్నేహితుడైన న్యాయవాది ఇంటిలో పోలీసులు సోదాలు చేశారు. న్యాయవాది ఇంటిలో కాశీకి సంబంధించిన ఎలాంటి ఆధారాలు చిక్కలేదు. తరువాత నాగర్ కోవిల్ లో ప్రముఖ స్వీట్ స్టాల్ యజమాని కొడుకు ఇంటిలో, మరో ముగ్గురు స్నేహితుల ఇళ్లలో సోదాలు చెయ్యడంతో కాశీకి చెందిన ల్యాప్ టాప్ లు, సీక్రెట్ మొబైల్ వాచ్ లు, మొబైల్ ఫోన్లు, రెండు హార్డ్ డిస్క్ లు చిక్కడంతో వాటిని స్వాధీనం చేసుకున్న సైబర్ క్రైం పోలీసులు వాటిని పరిశీలిస్తున్నారు.

ఆల్ ఇండియాలో అమ్మాయిలు, ఆంటీలు
తమిళనాడుతో పాటు దక్షిణ, ఉత్తర భారతదేశానికి చెందిన అమ్మాయిలు, ఆంటీలను కాశీ వలలో వేసుకున్నాడని వెలుగు చూసింది. ఇలా అమ్మాయిలను, ఆంటీలను వలలో వేసుకున్న కాశీ స్నేహితుల ఇళ్లకు, ఫాం హౌస్ లు, పర్యాటక ప్రాంతాలకు తీసుకెళ్లి వారితో రాసలీలలు సాగిస్తూ రహస్యంగా వీడియోలు, ఫోటోలు తీశాడు.
తరువాత అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే ఆ నగ్న వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని బెదిరించి వారి నుంచి రూ. లక్షలు వసూలు చేశాడని పోలీసులు అంటున్నారు. ఇప్పటి వరకు ఫిర్యాదు చేసిన మహిళల నుంచి రూ. 7 లక్షలకు పైగా వసూలు చేశాడని, ఇంకా ఎంత మంది ఫిర్యాదు చేస్తారో ? తెలియడం లేదని, వారి నుంచి కాశీ ఎంత డబ్బులు వసూలు చేశాడో ? అని వివరాలు సేకరిస్తున్నామని పోలీసులు అంటున్నారు. చెన్నై లేడీ డాక్టర్ తో పాటు మరో ముగ్గురు అమ్మాయిలు కాశీ మీద పోలీసు అధికారులకు ఫిర్యాదు చేశారు.
Recommended Video

చిన్మయి పోరాటం
ప్రముఖ మహిళా న్యాయవాది, మీటూ పోరాటంలో చురుకుగా పాల్గొంటున్న చిన్మయి శ్రీపాద సైతం కాశీ అగడాల గురించి పూర్తి వివరాలు సేకరించి పోలీసులకు అందించడానికి సిద్దం అయ్యారు. కండలు పెంచిన ఫోటోలతో పాటు నకిలీ ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టి అమ్మాయిల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కాశీని కఠినంగా శిక్షించాలని పలు మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. వంద మంది అమ్మాయిల జీవితాలతో చెలగాటం ఆడిన కాశీని అరెస్టు చేసిన తమిళనాడు పోలీసులు నాగర్ కోవిల్ కు చెందిన అతని ముగ్గురు స్నేహితులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications