బీహార్ ఎన్నికలకు ముందే ఎన్డీయేకు షాక్..! భోజ్ పురి నటి రూపంలో..!

వచ్చే నెలలో జరిగే బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు జోరుగా ప్రచారం సాగుతోంది. ఎన్డీయే వర్సెస్ ఇండియా కూటమిగా సాగుతున్న ఈ ఎన్నికల్లో చిన్న పార్టీలు సైతం కీలక పాత్ర పోషిస్తాయని అంచనా వేస్తున్నారు. దీంతో 243 సీట్లు ఉన్న బీహార్ అసెంబ్లీలో ప్రతీ సీటును పార్టీలు కీలకంగా భావిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ఎన్నికలకు ముందే అధికార ఎన్డీయేకు ఇవాళ ఎదురుదెబ్బ తగిలింది.

బీహార్ ఎన్నికల్లో ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్న లోక్ జన్ శక్తి (రాంవిలాస్ పాశ్వాన్) అభ్యర్ధి, భోజ్ పురి నటి కూడా అయిన సీమా సింగ్ నామినేషన్ ను అధికారులు ఇవాళ తిరస్కరించారు. నామినేషన్ల పరిశీలన సందర్భంగా తప్పులున్నట్లు తేలడంతో దాన్ని తిరస్కరిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో మొత్తం నాలుగు నామినేషన్లు తిరస్కరణకు గురి కాగా.. ఇందులో సీమా సింగ్ నామినేషన్ కూడా ఉంది. దీంతో మధౌరా నియోజకవర్గంలో విపక్ష ఇండియా కూటమి అవకాశాలు మెరుగుపడ్డాయి.

setback to nda before bihar election as LJP candidate nomination rejected

ప్రముఖ భోజ్ పురి నటి అయిన సీమా సింగ్ తాజాగా లోక్ జన్ శక్తి పార్టీలో చేరారు. వెంటనే ఆమెకు పార్టీ టికెట్ కూడా కేటాయించింది. దీంతో ఆమె తాజాగా మధౌరా నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. అయితే నామినేషన్లో పేర్కొన్న విద్యార్హతలు, ఆస్తుల వివరాల్లో తేడాలు ఉండటంతో ఎన్నికల అధికారులు దాన్ని తిరస్కరించినట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఈ సీటును కచ్చితంగా గెలుస్తామని ఎన్డీయే అంచనాలు వేసుకుంది. కానీ చివరి నిమిషంలో ఇలా నామినేషన్ తిరస్కరణకు గురైంది.

setback to nda before bihar election as LJP candidate nomination rejected

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం ఏ పార్టీ లేదా కూటమికి అయినా 122 సీట్లు అవసరం. గత ఎన్నికల్లో బీజేపీ-జేడీయూ కలిసి 125 సీట్లు గెల్చుకున్నాయి. ఆర్జేడీ, కాంగ్రెస్ తో కూడిన విపక్ష మహా కూటమికి 100 సీట్లకు పైగా దక్కాయి. ఈసారి ఎన్నికల్లో విపక్ష కూటమిపై మరోసారి ఆధిక్యం ప్రదర్శించాలని ఎన్డీయే పట్టుదలగా ఉంది. కానీ సర్వే నివేదికల ప్రకారం ఈసారి విపక్ష కూటమికి మొగ్గు కనిపిస్తుండటంతో భాగస్వామ పార్టీలు సీట్ల విషయంలో అస్సలు రాజీపడటం లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+