వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాజీ జడ్జిపై వేధింపు ఆరోపణలు: తీవ్రమైనవే.. మొయిలీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఎకె గంగూలీ తర్వాత మరో మాజీ న్యాయమూర్తి పైన లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి స్వతంత్ర కుమార్... ఆ ఆరోపణలపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. స్వతంత్ర కుమార్ శుక్రవారం కొన్ని పత్రికలతో మాట్లాడుతూ... అవన్నీ తప్పుడు ఆరోపణలని, కుట్రలో భాగమన్నారు.

కాగా, స్వతంత్ర కుమార్ పైన వచ్చిన ఆరోపణలను తీవ్రంగానే పరిగణించాల్సి ఉంటుందని అయితే, వీటిపై దర్యాఫ్తు జరిపించాలా వద్దా అనేది సుప్రీం కోర్టు నిర్ణయిస్తుందని కేంద్రమంత్రి వీరప్ప మొయిలీ చెప్పారు.

Sexual Assault: After AK Ganguly, another judge in dock

ప్రస్తుతం ఒక ట్రిబ్యునల్ చైర్మన్‌గా పని చేస్తున్న సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తిపై వచ్చిన ఆరోపణలు తీవ్రమైనవనవని, ఆరోపణలపై దర్యాప్తు జరిపించాలా? లేదా? అనే విషయాన్ని నిర్ణయించుకోవాల్సింది సుప్రీం కోర్టేనని, దినప్రతికల్లో వచ్చిన వార్తలను బట్టి చూస్తే
ఆరోపణలు తీవ్రమైనవిగా ఉన్నాయని.. న్యాయమూర్తిపై మహిళా ఇంటర్న్ చేసిన సెక్స్ వేధింపుల ఆరోపణలను మొయిలీ ప్రస్తావించారు.

అయితే అధికారికంగా ఫిర్యాదు లేనిదే దీనిపై తానేమీ చెప్పలేనని చెప్పారు. 2011 మేలో సుప్రీంకోర్టులో సిట్టింగ్ జడ్జిగా ఉన్నప్పుడు ఈ మాజీ న్యాయమూర్తి తన కార్యాలయంలోనే తనను లైంగికంగా వేధించారని ఆయన వద్ద శిక్షణలో ఉన్న మహిళా న్యాయవాది ఒకరు ఆరోపించారు.

ఆరోపణలు ఎదుర్కొంటున్న న్యాయమూర్తి సుప్రీం కోర్టు జడ్జిగా ఉన్నప్పుడు ఈ సంఘటన జరిగిన విషయాన్ని మొయిలీ గుర్తు చేశారు. మరోవైపు తాను చేసిన ఆరోపణలపై దర్యాఫ్తు జరిపించాలన్న న్యాయ విద్యార్థిని డిమాండుకు పలువురు మద్దతు తెలిపారు.

English summary
After AK Ganguly, another retired Supreme Court judge has landed in a serious legal soup. The law maker, who has been identified as Kumar, has been accused of sexually assaulting a female intern.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X