ట్రంప్-మమ్దానీ మీటింగ్ ను వాడేసుకున్న శశి థరూర్ ..! కాంగ్రెస్ కు ఝలక్..!

కొంతకాలంగా సొంత పార్టీ కాంగ్రెస్ పై అలిగి బీజేపీకి, ప్రధాని మోడీకి దగ్గరగా మెలుగుతున్న రెబెల్ ఎంపీ శశి థరూర్ వార్తల్లో నిలుస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని వీడకుండానే ఆ పార్టీకి బద్ధ శత్రువైన ప్రధాని మోడీపై ప్రశంసల జల్లు కురిపిస్తూనే ఉన్నారు. ఇదే క్రమంలో ఆయన అందివచ్చిన ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోవడం లేదు. ఈ నేపథ్యంలో ఇవాళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, న్యూయార్క్ మేయర్ జొహ్రాన్ మమ్దానీ భేటీని కూడా తనకు అన్వయించుకుంటూ వాడేసుకున్నారు.

అమెరికాలో తాజాగా జరిగిన న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో డెమెక్రాట్ అభ్యర్ధిగా పోటీ చేసిన జొహ్రాన్ మమ్దానీ రిపబ్లికన్ అయిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు భారీ షాకిచ్చారు. మమ్దానీ గెలవకుండా ట్రంప్ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. ట్రంప్ విధానాలను బహిరంగంగానే వ్యతిరేకిస్తూ బలంగా తన వాదన వినిపించిన మమ్దానీ న్యూయార్క్ మేయర్ గా జయకేతనం ఎగురవేశారు. దీంతో ట్రంప్-మమ్దానీ రాజకీయ శత్రుత్వం పరాకాష్టకు చేరుతుందని అంతా భావించారు. కానీ ఇవాళ వీరిద్దరూ అనూహ్యంగా భేటీ అయ్యారు. ఈ పరిణామం అమెరికాతో పాటు అంతర్జాతీయంగా కూడా చర్చనీయాంశమైంది.

Shashi Tharoor Cites Trump-Mamdani Meeting to Defend His Ties with PM Modi

ఇవాళ ట్రంప్-మమ్దానీ భేటీ తర్వాత ఉమ్మడిగా ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇందులో ఓ మీడియా ప్రతినిధి మమ్దానీని.. గతంలో మీరు ట్రంప్ ఫాసిస్ట్ అన్నారు కదా.. ఇప్పటికీ అదే అభిప్రాయంతో ఉన్నారా అని ప్రశ్నించారు. దీనికి జవాబు చెప్పేందుకు మమ్దానీ తడబడుతుండగా.. ట్రంప్ జోక్యం చేసుకని మీరు అవునని చెప్పొచ్చని సూచించారు. దీంతో మమ్దానీ కూడా అవునని చెప్పేశారు. దీనిపై ట్రంప్ స్పందిస్తూ.. మమ్దానీ ఓ గీత గీసుకున్నాడు, దాన్ని వివరించడం కంటే ఇదే సులభం అని తెలిపారు.ఈ సంభాషణ కూడా నెట్లో వైరల్ అయింది.

Shashi Tharoor Cites Trump-Mamdani Meeting to Defend His Ties with PM Modi

దీంతో ట్రంప్-మమ్దానీ వీడియోను కాంగ్రెస్ ఎంపీ శశిధరూర్ ట్వీట్ చేసారు. దీనిపై థరూర్ స్పందిస్తూ.. ప్రజాస్వామ్యం ఇలాగే పనిచేయాలన్నారు. ఎన్నికల్లో మీ దృక్కోణం కోసం ఎటువంటి వాక్చాతుర్య అడ్డంకులు లేకుండా ఉత్సాహంగా పోరాడాలన్నారు. కానీ అది ముగిసిన తర్వాత, ప్రజలు మాట్లాడిన తర్వాత, మీరిద్దరూ సేవ చేయడానికి ప్రతిజ్ఞ చేసిన దేశ ఉమ్మడి ప్రయోజనాల కోసం ఒకరితో ఒకరు సహకరించుకోవడం నేర్చుకోవాలన్నారు. భారతదేశంలో ఇలాంటివి మరిన్ని చూడాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు. అలాగే తన వంతు కృషి చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు పరోక్షంగా మోడీకి దగ్గరవడాన్ని థరూర్ సమర్ధించుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+