నటి శిల్పాశెట్టికి తృటిలో తప్పిన ప్రమాదం, వాగ్వాదం
అమృత్సర్: బాలీవుడ్ నటి, శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాలు గురువారం రోడ్డు ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్నారు. జలంధర్ - అమృత్సర్ రోడ్డు పైన వారు కారులో వెళ్తుండగా ధిల్వాన్ పట్టణం వద్ద మరో కారు వీరి సెక్యూరిటీ కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు.
కాగా, అజాగ్రత్తగా కారు నడుపుతూ తమ కారును ఢీకొట్టారని, ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ పైన శిల్పాశెట్టి ధిల్వాస్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

శిల్పాశెట్టి, ఆమె భర్త అమృత్సర్ నుండి జలందర్ వెళుతుండగా ఈ సంఘటన జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే బౌన్సర్ ఎదుటి కారు డ్రైవర్‌తో వాగ్వాదానికి దిగాడు. అప్పుడు శిల్పాశెట్టి అక్కడి నుండి వెళ్లిపోయారు. పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కాగా, ఆ తర్వాత ఇరువర్గాలు పరిష్కరించుకున్నాయని తెలుస్తోంది. ఆ సమయంలో శిల్పాశెట్టి జలందర్‌లోని ఓ స్టోర్‌ను ప్రారంభించేందుకు కారులో వెళ్తున్నారు.
-
26/11 దాడుల నుంచి తృటిలో తప్పించుకున్నా: ధురంధర్ విలన్ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
viral video: ధురంధర్-2 చూసిన పాకిస్థాన్ ఫ్యామిలీ.. భారత్ కు వార్నింగ్..?? -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
నటి డ్రెస్ జిప్ తీసేసిన హీరో: డైరెక్టర్ కట్ చెప్పినా ఆగని రొమాన్స్! -
హిందీ స్టార్ హీరోల వేధింపుల వల్లే డైరెక్టర్లకు కష్టాలు.. -
సొంత భర్త సినిమాకు దీపిక ఆబ్సెంట్.. ఏం జరుగుతోంది..? -
"ధురంధర్ 2 సినిమాను బ్యాన్ చేయాలి" -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే! -
ఐ లవ్డ్ ధురంధర్ 1.. బట్ - జక్కన్న సెన్సేషన్ రివ్యూ: అలాంటి హీరోలందరినీ చంపేసింది -
బన్నీ మూవీలో ఐదుగురు భామలా? అట్లీ స్కెచ్ మామూలుగా లేదుగా! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్!












Click it and Unblock the Notifications