వైరల్ వీడియో: పొట్టు పొట్టు కొట్టుకున్న డాక్టర్- పేషంట్..
వైద్యో నారాయణో హరి అంటారు పెద్దలు. వైద్యుడిని దేవుడిలా చూస్తారు. అయితే హిమాచల్ ప్రదేశ్ లోని షిమ్లాలో మాత్రం ఓ వైద్యుడి కర్కశంగా ప్రవర్తించాడు. వైద్యం కోసం వచ్చిన రోగిపై కిరాతకంగా దాడి చేశాడు. ఈ క్రమంలో రోగి వైద్యుడిని ఆపే ప్రయత్నం చేసినా వినకుండా ఆ రోగిపై పిడిగుద్దులు గుద్దుతూ ఉన్నాడు. ఈ షాకింగ్ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.
హిమాచల్ ప్రదేశ్ షిమ్లాలోని ఇందిరా గాంధీ మెడికల్ కాలేజీలో షాకింగ్ ఘటన జరిగింది. చికిత్స కోసం వచ్చిన ఓ రోగిపై.. డాక్టర్ విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆ రోగిపై వైద్యుడు దాడి చేయడంపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. సమాజంలో ఇలాంటి వైద్యులు కూడా ఉంటారా అని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి డాక్టర్లను కఠినంగా శిక్షించాలని కామెంట్స్ పెడుతున్నారు.

స్థానిక పత్రిక అందించిన కథనం ప్రకారం షిమ్లాకు చెందిన ఓ వ్యక్తి తీవ్ర అనారోగ్య సమస్యలతో ఇందిరా గాంధీ మెడికల్ కాలేజీకు వెళ్లాడు. 'వైద్యులు ఎండోస్కోపీ చేశారు. విశ్రాంతి తీసుకోమన్నారు. నేను బెడ్ పై పడుకున్నాను. ఇంతలో ఓ వైద్యుడు హుటాహుటిన నా వద్దకు వచ్చి ఏం మాట్లాడకుండానే నాపై దాడికి పాల్పడ్డాడు. నేను అడ్డుకున్నా వినకుండా పిడి గుద్దులు గుద్దుతూ దాడికి పాల్పడ్డాడు..' అని బాధిత వ్యక్తి ఆవేదనతో చెప్పుకొచ్చాడు. రోగిని కాలితో తన్నుతూ ఉన్న దృశ్యాలు హాస్పత్రిలోని సీసీటీవీలో రికార్డు అయ్యాయి.
IGMC शिमला का ये वीडियो बिस्तर पर लेटा हुआ व्यक्ति एंडोस्कोपी करवाने अस्पताल आया था।
— Gems of Himachal (@GemsHimachal) December 22, 2025
बात कुछ भी हुई हो इस तरह का व्यवहार किसी डॉक्टर द्वारा निंदनीय है, डॉक्टर भगवान का रूप है पर इस तरह के कुछ लोग इस प्रोफेशन पर सवालिया निशान खड़े करते है
अगर बात हाथापाई तक आई है तो इसके कारण… pic.twitter.com/IWYWHLp0Ob
ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఆందోళనలకు దారి తీసింది. రోగులపై వైద్యుల ప్రవర్తన ఇలా ఉండటంపై రోగి బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. అయితే ఈ ఘటనపై ఇందిరా గాంధీ మెడికల్ కాలేజీ స్పందించారు. వైద్యుడిపై ఆ రోగి పోలీసులకు ఫిర్యాదు చేశాడని.. వైద్యుడిపై ఎఫ్ఐఆర్ కూడా నమోదైందని వివరించారు. ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఆ రాష్ట్ర ఆరోగ్యమంత్రి కూడా స్పందించారు. వైద్యుడిపై చర్యలు తీసుకుంటామని అన్నారు.












Click it and Unblock the Notifications