కర్ణాటక సీఎం బొమ్మైకు షాక్; హైదరాబాద్లో వారికి హోటల్స్ బుక్; క్యాంప్ రాజకీయాలు షురూ!!

కర్ణాటక ఎన్నికల ఫలితాలు ఉత్కంఠను రేపుతున్నాయి. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ లోనే కాంగ్రెస్ పార్టీ ఆధిక్యాన్ని ప్రదర్శించింది. మ్యాజిక్ ఫిగర్ ను దాటి కాంగ్రెస్ పార్టీ దూసుకుపోయింది . కోస్టల్ కర్ణాటక తప్ప అన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతోంది.

కర్ణాటక రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలో కాంగ్రెస్ పార్టీ దూసుకుపోవడంతో ముఖ్యమంత్రి బస్వరాజు బొమ్మై కు షాక్ తగిలినట్టు అయింది. ఖచ్చితంగా తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేసిన ఆయన ప్రస్తుతం వస్తున్న ఫలితాలతో ఆందోళనలో ఉన్నారు. ముఖ్యమంత్రి బస్వరాజు బొమ్మై సొంత జిల్లా హవేరిలోని ఆరు నియోజకవర్గాలలో ఐదు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ముందంజ లో ఉంది.

Karnataka election 2023 results

బిజెపి ఒక స్థానంలో మాత్రమే ఆధిక్యతను ప్రదర్శిస్తుంది. అది కూడా బొమ్మై సొంత నియోజకవర్గం షిగ్గావ్ కావటం గమనార్హం. ఈ పరిణామాలు బసవరాజ్ బొమ్మై కు షాక్ అనే చెప్పాలి. సొంత జిల్లాలోనూ ఆయనకు ఎదురు గాలి వీయటం బీజేపీ శ్రేణులను ఆందోళనకు గురి చేస్తుంది.ఇదిలా ఉంటే కర్ణాటక ఎన్నికల ఫలితాలలో ఏకపక్ష తీర్పు వస్తుందని ఏ రాజకీయ పార్టీ భావించడం లేదు.

హంగ్ వస్తుందని భావిస్తున్న నేపథ్యంలో ఎవరికి వాళ్ళు ఆపరేషన్ ఆకర్ష అంటున్నారు. హైదరాబాద్ కేంద్రంగా క్యాంపు రాజకీయాలకు తెర తీసినట్టు కనిపిస్తుంది. హైదరాబాద్ లోని నోవాటెల్, తాజ్ కృష్ణ, పార్క్ హయత్ హోటల్స్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నేతల పేర్లతో బుక్ చేసినట్లుగా తెలుస్తుంది. కర్ణాటక ఎన్నికల ఫలితాలు వెల్లడైన వెంటనే గెలిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను క్యాంప్ కు తరలించే ఏర్పాట్లు కాంగ్రెస్ పార్టీ చేస్తోంది .

Karnataka election 2023 results

ఇప్పటికే ఫలితాల సరళిపై మల్లికార్జున ఖర్గేతో నేతలు మంతనాలు జరుపుతున్నారు. ఇదిలా ఉంటే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో కళ్యాణ రాజ్య ప్రగతి పార్టీ అభ్యర్థి అయిన గాలి జనార్దన్ రెడ్డి బళ్లారి సిటీ లో దూసుకుపోతున్నారు. ఆయన సతీమణి లక్ష్మి గంగావతిలో మాత్రం వెనుకంజలో ఉన్నట్లుగా సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+