షాకింగ్: స్కూల్ పిల్లలకు ఆశారాం బాపూ 'సెక్స్ టిప్స్'
రాయ్‌పూర్: చత్తీస్‌గఢ్ రాష్ట్ర ప్రభుత్వం మరో వివాదంలో చిక్కుకుంది. దేశంలో నిరుద్యోగానికి వర్కింగ్ మహిళలు కారణమని పాఠ్య పుస్తకాల్లో కనిపించింది. దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా, మరో వివాదం చెలరేగింది. సమాచారం మేరకు.. ఆశారాం బాపు సెక్స్ టిప్స్‌కు సంబంధించిన పుస్తకాలను పంచారు.
రాష్ట్రంలోను పలు ప్రభుత్వ పాఠశాలల్లో ఆశారాం బాపుకు చెందిన సెక్స్ టిప్స్‌కు సంబంధించిన పుస్తకాలను పంచి పెట్టారని విమర్శలు వస్తున్నాయి. మరో షాకింగ్ అంశం ఏమంటే... కొండగాన్ జిల్లాలోని ఓ పాఠశాలలో ఈ పుస్తకాలలోని శృంగార టిప్స్‌ను విద్యార్థులచే బలవంతంగా చదివించారని చెబుతున్నారు.

ఆ పుస్తకం పేరు 'దివ్య ప్రేరణ-ప్రకాశ్'. దీనిని తనకు తాను దేవుడిగా చెప్పుకునే ఆశారాం బాపు రాశారు. ఆ పుస్తకంలో దారుణమైన విషయాలు ఉన్నాయని తెలుస్తోంది. ఎవరికైనా శృంగారంలో సంతృప్తి లేకుంటే... అది వారి జీవితం పైన ప్రభావం చూపుతుందని ఆ పుస్తకంలో ఉందని తెలుస్తోంది.
ఆంగ్ల మీడియాలో వస్తున్న దాని ప్రకారం... 2012లో రమణ్ సింగ్ ప్రభుత్వం ఈ పుస్తకాన్ని బ్యాన్ చేసింది. అయితే, నోటీసులను కొన్ని జిల్లాలకు పంపించడంలో సంబంధిత శాఖ విఫలమైందని తెలుస్తోంది. దీంతో, పలు జిల్లాల్లో ఈ పుస్తకాన్ని కొనసాగిస్తున్నారని తెలుస్తోంది. మరోవైపు, దీని పైన ముఖ్యమంత్రి రమణ్ సింగ్ విచారణకు ఆదేశించారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications