Shocking: ఎంపీ కంగనా రనౌత్ చెంప పగలగొట్టిన సిఐఎస్ఎఫ్ మహిళా కానిస్టేబుల్.. ఎందుకంటే
బాలీవుడ్ క్వీన్, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ కు నేడు చండీగఢ్ విమానాశ్రయంలో చేదు అనుభవం ఎదురైంది. చండీగఢ్ విమానాశ్రయంలో ఆమె ఊహించని ఘటన జరిగింది. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ కి చెందిన మహిళా సిబ్బంది కుల్వీందర్ కౌర్ మండి ఎంపీ కంగనారనౌత్ చెంప పగలగొట్టారు.
కంగనా చెంప పగలగొట్టిన సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్
శుక్రవారం జరగనున్న ఎంపీల సమావేశంలో పాల్గొనడానికి ఆమె ఢిల్లీ వెళుతుండగా చండీగఢ్ ఎయిర్పోర్టులో విధుల్లో ఉన్న సిఐఎస్ఎఫ్ మహిళా కానిస్టేబుల్ తనని చెంప దెబ్బ కొట్టారని కంగనా రనౌత్ ఆరోపించడం తీవ్ర దుమారం రేపుతోంది. హిమాచల్ ప్రదేశ్ లోని మండి నుంచి లోక్సభ ఎన్నికల్లో గెలిచిన రెండు రోజుల వ్యవధిలోనే కంగనా రనౌత్ పబ్లిక్ గా చేదు అనుభవాన్ని చవిచూశారు .

సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ పై కంగనా సంచలన ఆరోపణ
ఈరోజు మధ్యాహ్నం మూడున్నర గంటల ప్రాంతంలో ఎంపీ కంగనా రనౌత్ ఢిల్లీ వెళ్లేందుకు విమానం ఎక్కుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. యూకే 707విమానంలో చండీగఢ్ విమానాశ్రయం నుండి ఢిల్లీకి వెళ్లేందుకు ఎయిర్పోర్టుకు చేరుకున్న క్రమంలో బోర్డింగ్ పాయింట్ వద్దకు వెళుతున్నప్పుడు తనతో పుల్వీందర్ కౌర్ అనే సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ వాగ్వాదానికి దిగినట్టు కంగనా తెలిపారు. అంతేకాదు ఆ సమయంలో తన చెంపపై పుల్వీందర్ కౌర్ కొట్టారని సంచలన ఆరోపణలు చేశారు.
కంగనా చెంప దెబ్బకు కారణమిదే
ఢిల్లీ వెళ్లేందుకు బయలుదేరిన కంగనా రనౌత్ బోర్డింగ్ పాయింట్ కు వెళ్తున్న సమయంలో రైతుల నిరసనలపై చేసిన వ్యాఖ్యలతో, రైతులను ఉగ్రవాదులతో పోల్చడంతో అసహనానికి గురైన సిఐఎస్ఎఫ్ సిబ్బంది కుల్వీందర్ కౌర్ కంగనా రనౌత్ చెంప పగలగొట్టారు . ఆందోళన చేస్తున్న రైతులను ఖలిస్థాని ఉగ్రవాదులతో కంగనా రనౌత్ పోల్చడం తో తీవ్ర అసహనం చెందిన సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ ఆమెను కొట్టారు.
చండీగఢ్ విమానాశ్రయంలోనే అభ్యంతరం వ్యక్తం చేసిన కంగనా
ఈ ఘటనతో షాక్ అయినా కంగనా రనౌత్ మహిళా కానిస్టేబుల్ కుల్వీందర్ కౌర్ ప్రవర్తనపై తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ CISF అధికారుల నుండి వివరణ కోరేందుకు ప్రయత్నించారు. ఇక ఈ ఘటన నేపథ్యంలో ఆమె అనుచరులు మరియు ఇతర సిబ్బంది ఆమెను శాంతింపజేశారు.
ఢిల్లీలో సిఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ కు ఫిర్యాదు.. అదుపులో కుల్వీందర్ కౌర్
అయితే ఘటన తర్వాత ఢిల్లీ వెళ్లిన కంగనా రనౌత్ అక్కడ సిఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ నీనా సింగ్ తో పాటు ఇతర సీనియర్ అధికారులకు ఘటన మొత్తాన్ని వివరించి, బ్రదర్ కానిస్టేబుల్ పై చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో కుల్వీందర్ కౌర్ ను అదుపులోకి తీసుకొని విచారణ నిమిత్తం పి ఐ ఎస్ ఎఫ్ కమాండెంట్ ఆఫీస్ కు తరలించారు.












Click it and Unblock the Notifications