షాకింగ్ వీడియో: వెంటపడి మహిళను బూటు కాలితో తన్నిన పోలీసు
న్యూఢిల్లీ: ఇంటర్నెట్లో ఓ షాకింగ్ వీడియో హల్ చల్ చేస్తోంది. ఓ వైపు మహిళల పైన దేశంలో జరుగుతున్న అత్యాచారాల పైన విస్తృతస్థాయిలో చర్చ సాగుతుండగా.. ఓ పోలీసు మహిళ పట్ల దారుణంగా ప్రవర్తించాడు. మహిళ నెట్టేసి, కొట్టాడు. ఈ వీడియో ఇంటర్నెట్లో సంచలనం రేపుతోంది.
ఒక మహిళ పట్ల పోలీసు దారుణంగా దాడికి దిగడం గమనార్హం. ఆమె పరుగు తీస్తున్నా వెంటపడి కొట్టాడు. కిందపడినా వదలకుండా బూటు కాళ్లతో తన్నాడు. ఈ పోలీస్ తన క్రూరత్వం మొత్తాన్ని అసహాయ మహిళపై చూపించాడు. సుమారు నిమిషంపాటు వీడియో క్లిప్ ఉంది. ఈ దారుణం ఉత్తర ప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లాలో జరిగింది.
Unnao (UP): Policemen beat woman during protest after a road accident https://t.co/YahLSnTCZk
— ANI (@ANI_news) March 7, 2015 తన తీవ్రంగా కొట్టడంతో కింద పడిన ఆ మహిళను వదలకుండా మళ్లీ మళ్లీ కొట్టడం విభ్రాంతి కలిగిస్తోంది. మరో దారణ విషయమేమంటే.. ఈ సంఘటన జరుగుతున్నప్పుడు పక్కన కొందరు చూస్తూ ఉన్నారు. అందులో ఇద్దరు పోలీసులు కూడా ఉన్నారు.












Click it and Unblock the Notifications