IPL 2023 : ఐపీఎల్ ఫస్టాఫ్ కు శ్రేయస్ అయ్యర్ దూరం ! కేకేఆర్ ముందు మూడు ఆప్షన్స్ ఇవే..
కోల్‌కతా : కోల్ కతా నైట్ రైడర్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ కనీసం IPL 2023 మొదటి అర్ధభాగానికి దూరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అయ్యర్ ప్రస్తుతం రిపీటెడ్ లోయర్ బ్యాక్ పెయిన్ (నడుం నొప్పి) తో బాధపడుతున్నారు. దీంతో అయ్యర్ కు తాజాగా శస్త్రచికిత్స చేశారు. ఆపరేషన్ అనంతరం విశ్రాంతి తీసుకోవాల్సిందిగా డాక్టర్లు అయ్యర్ కు సూచించారు. దీంతో ఇప్పటికే ఆస్ట్రేలియాతో చివరి టెస్టుతో పాటు వన్డే సిరీస్ కు కూడా దూరమయ్యాడు. బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో బీసీసీఐ పర్యవేక్షణలో అయ్యర్ కోలుకోవాల్సి ఉంది.
ఆపరేషన్ తర్వాత శ్రేయస్ అయ్యర్ తిరిగి ఐపీఎల్ ప్రథమార్దంలో జట్టుతో పాటు చేరతాడని యాజమాన్యం భావించింది. అయితే అది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. దీంతో అయ్యర్ ఐపీఎల్ ప్రథమార్ధానికి దూరమైనట్లే భావిస్తున్నా రు. మరోవైపు అయ్యర్ గైర్హాజరీలో కేకేఆర్ కెప్టెన్ గా ఎవరిని ఎంపిక చేయాలనే దానిపై యాజమాన్యం చర్చలు జరుపుతోంది. అయ్యర్ స్ధానంలో కెప్టెన్ గా, బ్యాట్స్ మెన్ గా బాధ్యతలు నిర్వహించే ఆటగాడి ఎంపికలో కేకేఆర్ టీమ్ కు మూడు ఆప్షన్స్ కనిపిస్తున్నాయి.

గత సీజన్ లో రూ.12.25 కోట్లకు అయ్యర్ ను కొనుగోలు చేసిన కేకేఆర్ కు ఈ సీజన్ లో అతను గాయంతో దూరం కావడం పెద్ద మైనస్ గా మారబోతోంది. అయితే అయ్యర్ స్ధానాన్ని భర్తీచేసేందుకు యాజమాన్యం మొత్తం మూడు ఆప్షన్స్ ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఆల్ రౌండర్ సునీల్ నరైన్ ముందు వరుసలో ఉన్నాడు. తాజాగా అద్భుతమైన ఫామ్ లో ఉన్న నరైన్ ను కెప్టెన్ గా కేకేఆర్ పరిశీలిస్తోంది. గతంలో ILT20లో అబుదాబి నైట్ రైడర్స్, కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ వంటి జట్లకు కెప్టెన్ గా పనిచేసిన చరిత్ర నరైన్ ఉంది.

మరోవైపు కేకేఆర్ తరఫున తొలిసారి ఆడుతున్న బౌలర్ శార్దూల్ ఠాకూర్ ను సైతం కెప్టెన్సీ కోసం ఆ జట్టు యాజమాన్యం పరిశీలిస్తోంది. కేకేఆర్ కోచ్ చంద్రకాంత్ పండిట్‌తో ఉన్నపరిచయాలు శ్రేయస్ కు ప్లస్ అవుతున్నాయి. కారణంగా శ్రేయాస్‌ని కెప్టెన్‌గా భర్తీ చేయవచ్చు. ప్రస్తుతం ఆల్ రౌండర్ గానూ రాణిస్తున్న అయ్యర్ వైపు కేకేఆర్ మొగ్గుచూపే అవకాశాలూ లేకపోలేదు.అలాగే మరో ఆప్షన్ గా బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకీబుల్ హసన్ కూడాకనిపిస్తున్నాడు. తాజాగా జట్టులోకి తిరిగి వచ్చిన షకీబుల్... కొత్త సీజన్లో నాయకత్వ బాధ్యతలు చేపట్టేందుకు తగ్గిన ఆటగాడిగా కనిపిస్తున్నాడు. చాలాఏళ్లు బంగ్లాదేశ్ జట్టు కెప్టెన్ గా పనిచేసిన అనుభవంతో పాటు మేనేజ్ మెంట్ తో ఉన్న సన్నిహిత సంబంధాలు షకీబుల్ వైపు కేకేఆర్ చూసేలా చేస్తున్నాయి.













Click it and Unblock the Notifications