శృతిహాసన్‌పై దాడి: వ్యక్తి అరెస్ట్, బెదిరించేందుకు కాదని..

తన సోదరుడికి ఉద్యోగం అడిగేందుకు తాను శృతి హాసన్ ఇంటికి వెళ్లగా ఆమె భయంతో తలుపు పెట్టుకుందని నిందితుడు చెబుతున్నట్లుగా పోలీసులు చెప్పారు. తనకు ఆమెను బెదిరించాల్సిన అవసరం లేదని చెప్పాడని తెలిపారు.
బాంద్రా పోలీసుల ప్రకారం... ఈ ఘటన మంగళవారం ఉదయం తొమ్మిదిన్నర గంటల సమయంలో జరిగింది. శృతి బాంద్రాలోని ఆరో ఫ్లోర్‌లోని తన అపార్టుమెంటులో ఉన్నప్పుడు ఈ సంఘటన జరిగింది.
ఇరవై ఏడేళ్ల శృతి తన ఇంట్లోకి అశోక్ చొచ్చుకొని వచ్చినట్లు చెప్పింది. తనను గుర్తు పట్టలేదా అని అతను ఆమెను అడిగాడు. అంతేకాకుండా ఆమె భుజాల పైన చేతులు వేశాడు. దీంతో బెదిరిపోయిన శృతి అతనిని బయటకు నెట్టేసి తలుపు పెట్టేసుకుంది. పోలీసులు నిందితుడి పైన 354, 452, 345 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.












Click it and Unblock the Notifications