సీఎం, సిద్దరామయ్య కొత్త కారు ఎన్ని కోట్లు అంటే ?, కౌంటర్ ఇస్తున్న అబిమానులు !
బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటకలో దుమ్ములేపిన కాంగ్రెస్ పార్టీ ఏకంగా 135 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్న ఈరోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది. సిద్దరామయ్య సీఎంగా, ఉప ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ శనివారం మద్యాహ్నం ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. సిద్దరామయ్య, డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి దేశంలోని హై ప్రోఫైల్ పొలిటికల్ లీడర్లు హాజరు అవుతన్నారు.
సిద్దరామయ్య, డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి లక్ష మందికి పైగా కార్యకర్తలు హాజరౌతున్నారు. సీఎంగా పదవి చేపడుతున్న సిద్దరామయ్య సంచరించడానికి ఓ కొత్త కారు కొనుగోలు చేస్తున్నారు. ఇంతకాలం సింపుల్ గా ఉండే సిద్దరామయ్య ఇప్పుడు కోట్ల రూపాయల విలువైన కారు కొనుగోలు చేస్తుండం హాట్ టాపిక్ అయ్యింది.

సీఎం హోదాలో ఉండే సిద్దరామయ్యకు ప్రభుత్వం కొత్త కారు ఇస్తోంది. అయితే సిద్దరామయ్య టోయోటా వెల్ ఫైర్ కారును కొనుగోలు చెయ్యడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. అయితే ప్రభుత్వ సొమ్ముతో కాకుండా సిద్దరామయ్య సొంతంగా ఆయన డబ్బుతో టయోటా వెలఫైర్ కారును కొనుగోలు చేస్తున్నారని తెలిసింది. అయితే ఈ విషయంలో ఇంకా క్లారిటీ లేదు.
టోయోటా వెల్ ఫైర్ కారును ఇప్పటికే ప్రముఖ పొలిటీషియన్లు, సెలబ్రిటీలు ఉపయోగిస్తున్నారు. ఈ కారు ధ రూ. 96. 55 లక్షలు, ఇన్సూరెన్స్, రిజిస్ట్రేషన్ తో పాటు ప్రభుత్వానికి చెల్లించాలన్సి అన్ని నియమాలు పాటిస్తే సిద్దరామయ్య కొంటున్న కొత్త కారు ధర రూ. 1. 20 కోట్లు అని వెలుగు చూడటం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.
కర్ణాటక సీఎంగా రెండో సారి ప్రమాణ స్వీకారం చేస్తున్న సిద్దరామయ్య సొంతంగా కారు కొనుగోలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నాయకులు అంటున్నారు, వయసు మీదపడిన సిద్దరామయ్య దూర ప్రయాణాలు చెయ్యడానికి ఆరోగ్యం సహకరించపోవడంతో టయోటా వెల్ ఫైర్ కారును కొనుగోలు చేస్తున్నారని ఆయన సన్నిహితులు అంటున్నారు.
అయితే సిద్దరామయ్యను వ్యతిరేకిస్తున్న కొందరు మాత్రం సిద్దరామయ్యకు ఇంత విలువైన కారు అవసరమా ? అని ప్రశ్నిస్తున్నారు. ఒక సీఎం కోటి రూపాయల విలువైన కారులో తిరిగితే తప్పు ఏముంది అంటూ సిద్దరామయ్య అనుయరులు ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద ఇప్పుడు సిద్దరామయ్య కొత్త కారు విషయం హాట్ టాపిక్ అయ్యింది.












Click it and Unblock the Notifications