Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

డేరా బాబా కోట్లు పోగేశాడు.. ఈ రెండేళ్లలో కూడబెట్టింది మాత్రం 18 వేలే..!

రోహ్‌తక్ : డేరా బాబాగా గుర్తింపు పొందిన సిర్సా డేరా చీఫ్ గుర్మీత్ రాం రహీం సింగ్ కోట్లు గడించాడు. అయితే ఈ రెండేళ్లలో మాత్రం ఆయన ఆదాయం చూస్తే మాత్రం ముక్కున వేలేసుకోవాల్సిందే. ఎందుకంటే ఆయన రెండు సంవత్సరాలలో కష్టపడి సంపాదించింది ఎంతో తెలుసా. కేవలం 18 వేల రూపాయలు. అంటే ఏడాదికి తొమ్మిది వేల రూపాయలే. ఈ లెక్కన ఆయన నెల ఆదాయం 750 రూపాయలు మాత్రమే. కోట్లు గడించిన డేరా బాబా ఈ నెల నెల సంపాదన ఏంటనే కదా డౌట్. ఇక అసలు విషయంలోకి వెళ్తే పూర్తి కథ అర్థమవుతుంది.

అత్యాచారం, హత్య కేసుల్లో డేరా బాబా ఆరోపణలు ఎదుర్కొన్నాడు. ఆ క్రమంలో 2017, ఆగస్టు 25వ తేదీన అంటే సరిగ్గా రెండేళ్ల కిందట ఆయనకు 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ పంచకుల సీబీఐ కోర్టు తీర్పు చెప్పింది. దాంతో డేరా బాబాను రోహ్‌తక్ జైలుకు పంపించారు అధికారులు. ఇక జైలులో ఈ రెండు సంవత్సరాల నుంచి కూలీగా పనిచేస్తూ కేవలం 18 వేల రూపాయలు మాత్రమే సంపాదించారు. బయట ఉన్నప్పుడు కోట్లు గడించిన డేరా బాబా.. కష్టం చేయాల్సి వచ్చేసరికి ఆదాయంలో ఎంత వ్యత్యాసం ఉందో గమనించాల్సిన విషయం.

Sirsa Dera chief Gurmeet Ram Rahim Singh jail income 18 thousands

జైలులో చేరినప్పుడు ఆయన బాగా బరువుగా ఉన్నాడట. దాదాపు 105 కిలోల భారీ కాయంతో కనిపించేవాడు. అయితే ఈ రెండేళ్లుగా శారీరక శ్రమనో ఏమో గానీ మొత్తానికి 15 కిలోలు తగ్గి ఇప్పుడు 90 కిలోలకు చేరాడట. అదలావుంటే జైలులో డేరా బాబాకు ప్రత్యేక వసతులు ఏమీ లేవంట. అతడిని చూసేందుకు వారానికోసారి కుటుంబ సభ్యులు వస్తారనేది జైలు అధికారులు చెబుతున్నమాట. బయట ఉన్నప్పుడు కష్టమంటే ఏంటో తెలియకుండా తిరిగిన డేరా బాబాను జైలులో అన్ స్కిల్డ్ లేబర్‌గా గుర్తించి కూరగాయాలు పండించే కూలీ పనులకు వినియోగించారట. అలా రోజుకు 40 రూపాయల కూలీ చొప్పున ఈ రెండేళ్లలో ఆయన కూడబెట్టిన మొత్తం 18 వేల రూపాయలన్నమాట.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+