Sister: భర్త లేడని వేరే వ్యక్తిని పెళ్లి చేసుకున్న చెల్లి, కళ్లల్లో కారం చల్లి తల్వార్ తో నరికి చంపేసిన అన్న !

బెంగళూరు/దారవాడ: కుటుంబ సభ్యులు చూపించిన యువకుడిని వివాహం చేసుకుంది. భర్తతో అతని భార్య సంతోషంగా కాపురం చేసింది. తరువాత అనారోగ్యంతో ఆమె భర్త చనిపోయాడు. భర్త అంత్యక్రియులు, 11 రోజుల దినాలు పూర్తి చేసిన భార్య తరువాత ఆమె పుట్టింటికి చేరుకుంది. భర్త చనిపోయిన తరువాత అంగన్ వాడి కేంద్రంలో ఉద్యోగం చేస్తున్న మహిళకు ఓ యువకుడు పరిచయం అయ్యాడు. భర్త చనిపోవడంతో ఆమె ఆ యువకుడు ప్రేమించుకున్నారు. చాలా కాలం ఇద్దరూ సహజీవనం చేశారు. భర్త చనిపోవడంతో ఆమె సహజీవనం చేస్తున్న వక్తిని వివాహం చేసుకోవాలని అనుకుంది. అయితే భర్త చనిపోయిన తరువాత అతనితో తిరగడమేకాకుండా అతన్ని పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో ఆమె అన్న పెళ్లి చేసుకోవడానికి నిరాకరించాడు. అన్నతో పాటు కుటుంబ సభ్యులను ఎదిరించిన మహిళ ఆమె ప్రియుడిని వివాహం చేసుకుంది. తనను ఎదిరించి వేరే వ్యక్తికి పెళ్లి చేసుకుందని ఆవేశంతో రగిలిపోయిన అన్న అతని చెల్లి ఇంటికి వెళ్లి ఆమె కళ్లలో కారం చల్లి తల్వార్ తీసుకుని ఆమెను ఇంట్లోనే దారుణంగా నరికి చంపేశాడు. చెల్లిని నరికి చంపిన అన్న తల్వార్ ఎత్తుకుని రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్లి పోలీస్ స్టేషన్ లో లొంగిపోవడం కలకలం రేపింది.

ఫ్యామిలీ చూపించిన వ్యక్తితో పెళ్లి

ఫ్యామిలీ చూపించిన వ్యక్తితో పెళ్లి


కర్ణాటకలోని దారవాడ జిల్లాలోని నవలగుంద పట్టణంలో శశికళ పాఠక్ అలియాస్ శశికళ (32) అనే మహిళ నివాసం ఉంటున్నది. కొన్ని సంవత్సరాల క్రితం హుబ్బళి సమీపంలోని అరళికట్టిలో నివాసం ఉంటున్న వీరేష్ అనే యువడితో శశికళ వివాహం జరిపించాలని నిర్ణయించారు. కుటుంబ సభ్యులు చూపించిన వీరేష్ ను శశికళ సంతోషంగా వివాహం చేసుకుంది.

చిన్న వయసులో భర్త చనిపోయాడు

చిన్న వయసులో భర్త చనిపోయాడు

వీరేష్ ను వివాహం చేసుకున్న తరువాత రెండు సంవత్సరాల మాత్రమే శశికళ అతనితో సంతోషంగా కాపురం చేసింది. తరువాత అనారోగ్యంతో శశికళ భర్త వీరేష్ చనిపోయాడు. భర్త వీరేష్ అంత్యక్రియులు, ఆయన 11 రోజుల దినాలు పూర్తి చేసిన భార్య శశికళ తరువాత నవలగుందలోని ఆమె పుట్టింటికి చేరుకుంది. చిన్న వయసులోనే భర్త వీరేష్ చనిపోవడంతో అతని భార్య శశికళ కుమిలిపోయింది.

లేడీ జీవితంలో ప్రియుడు ఎంట్రీ

లేడీ జీవితంలో ప్రియుడు ఎంట్రీ

భర్త వీరేష్ చనిపోయిన తరువాత అంగన్ వాడి కేంద్రంలో ఉద్యోగం చేస్తున్న కశికళకు రవి అనే యువకుడు పరిచయం అయ్యాడు. భర్త వీరేష్ చనిపోవడంతో శశికళ, పరిచయం అయిన రవి అనే యువకుడు ప్రేమించుకున్నారు. చాలా కాలం శశికళ, రవి కలిసి సహజీవనం చేశారు. భర్త వీరేష్ చనిపోవడంతో శశికళ సహజీవనం చేస్తున్న రవిని వివాహం చేసుకోవాలని అనుకుంది.

వారం ముందు ప్రియుడితో పెళ్లి

వారం ముందు ప్రియుడితో పెళ్లి


భర్త వీరేష్ చనిపోయిన తరువాత శశికళ రవితో తిరగడమేకాకుండా అతన్ని పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో ఆమె అన్న మాంతేష్ వారు పెళ్లి చేసుకోవడానికి నిరాకరించాడు. మా ప్రాణం పోయినా రవితో పెళ్లికి మేము అంగీకరించమని మాంతేష్ తేల్చి చెప్పాడు. అన్న మాంతేష్ తో పాటు కుటుంబ సభ్యులను ఎదిరించిన శశికళ ఆమె ప్రియుడు రవిని వారం రోజుల క్రితం వివాహం చేసుకుంది.

భర్త ఆసుపత్రికి..... ఇంట్లో భార్య

భర్త ఆసుపత్రికి..... ఇంట్లో భార్య

రవిని వివాహం చేసుకున్న శశికళ నవలగుందలోని రామలింగేశ్వర నగర్ లో వేరుగా కాపురం పెట్టింది. తనను ఎదిరించి తన చెల్లి శశికళ వేరే వ్యక్తిని వివాహం చేసుకుందని ఆమె అన్న మాంతేష్ రగిలిపోయాడు. రవి అతని తల్లిని పిలుచుకుని ఆసుపత్రికి వెళ్లాడు. ఆ సమయంలో ఇంట్లో శశికళ మాత్రమే ఉంది.

ఇంట్లో దూరి కళ్లల్లో కారం చల్లి నరికి చంపేసిన అన్న

ఇంట్లో దూరి కళ్లల్లో కారం చల్లి నరికి చంపేసిన అన్న


ఆవేశంతో రగిలిపోయిన అన్న మాంతేష్ నేరుగా రామలింగేశ్వర నగర్ లోని అతని చెల్లెలు శశికళ ఇంటికి వెళ్లాడు. ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చిన వెంటనే మాంతేష్ అతని చెల్లెలు శశికళ కళ్లల్లో కారం చల్లాడు. క్షణాల్లో వెంటతీసుకెళ్లిన తల్వార్ తీసుకున్న మాంతేష్ ఇంట్లోనే శశికళను దారుణంగా నరికి చంపేశాడు. చెల్లి శశికళను నరికి చంపిన అన్న మాంతేష్ తల్వార్ చేతిలో పట్టుకుని రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్లి నవనగుంద పోలీస్ స్టేషన్ లో లొంగిపోవడం కలకలం రేపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+