Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Sisters: భర్తలతో అందమైన అక్కాచెల్లి విడాకులు, ఊరి బయట ఇంట్లో సిస్టర్స్ ను చంపేసి !

బెంగళూరు/బళ్లారి: అందంగా ఉన్న అక్కాచెల్లికి గతంలో వేర్వేరు వ్యక్తులతో వివాహం అయ్యింది. వివిద కారాణాల వలన అక్కాచెల్లి వారి భర్తలతో విడాకులు తీసుకుని కలిసి జీవిస్తున్నారు. కాటన్ మిల్ లో పని చేస్తున్న అక్కాచెల్లి ఊరి బయట అద్దె ఇల్లు తీసుకుని ఒకే ఇంటిలో నివాసం ఉంటున్నారు. నాలుగు రోజుల క్రితం ఇంట్లో ఉన్న అక్కాచెల్లిని ఒకేసారి దారుణంగా చంపేసిన నిందితులు ఇంటి బయట తాళం వేసుకుని వెళ్లిపోయారు. ఇంటి నుంచి దుర్వాసనరావడంతో స్థానికులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇవ్వగా అక్కాచెల్లి హత్యకు గురైన విషయం వెలుగు చూసింది.

భర్తలతో విడాకులు

భర్తలతో విడాకులు


కర్ణాటకలోని బళ్లారి జిల్లా కూడ్లగి తాలుకాలోని చినకహళ్ళి గ్రామంలో గౌరమ్మ అలియాస్ గౌరి (34), రాధమ్మ అలియాస్ రాధ (32) అనే అక్కాచెల్లి నివాసం ఉంటున్నారు. అందంగా ఉన్న అక్కాచెల్లి గౌరమ్మ, రాధమ్మకు గతంలో వేర్వేరు వ్యక్తులతో వివాహం అయ్యింది. ఇప్పుడు గౌరమ్మ, రాధమ్మ ఒకే ఇంటిలో నివాసం ఉంటున్నారు. వివిద కారాణాల వలన అక్కాచెల్లి వారి భర్తలతో విడాకులు తీసుకున్నారు.

కాటన్ మిల్లులో పని

కాటన్ మిల్లులో పని

బళ్లారి జిల్లా నుంచి దావణగెరె చేరుకున్న రాధమ్మ, గౌరమ్మ ఆంజనేయ కాటన్ మిల్లులో పని చేస్తున్నారు. కాటన్ మిల్లులో పని చెయ్యడంతో మిల్లుకు దగ్గరగా ఉంటుందని దావణగెరె నగరంలో కాకుండా ఆ నగరం శివార్లలో అద్దె ఇల్లు తీసుకున్న రాధమ్మ, గౌరమ్మ ఇద్దరే అక్కడ నివాసం ఉంటున్నారు. గౌరమ్మ, రాధమ్మ సిస్టర్స్ కుటుంబ సభ్యులు బళ్లారి జిల్లాలోనే నివాసం ఉంటున్నారు.

అందంగా తయారౌతున్న అక్కాచెల్లి

అందంగా తయారౌతున్న అక్కాచెల్లి

అందంగా ఉన్న రాధమ్మ, గౌరమ్మ మీద కొందరు కామాంధుల కళ్లుపడ్డాయని సమాచారం. సాయంత్రం కాటన్ మిల్లులో పని ముగించుకుని ఇంటికి వెలుతున్న గౌరమ్మ, రాధమ్మ అందంగా రెడీ అయ్యి బయటకు వెళ్లి వచ్చేవాళ్లు. నాలుగు రోజుల నుంచి స్థానికులకు రాధమ్మ, గౌరమ్మ కనపడలేదు. శుక్రవారం రాధమ్మ, గౌరమ్మ ఇంటి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

నాలుగు రోజుల ముందే హత్య

నాలుగు రోజుల ముందే హత్య


పోలీసులు ఇంటి తలుపులు పగలగొట్టి చూడగా రాధమ్మ, గౌరమ్మ శవమై కనిపించారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న రాధమ్మ, గౌరమ్మ హత్యకు గురైనారని వెలుగు చూసింది. నాలుగు రోజుల క్రితమే రాధమ్మ, గౌరమ్మ హత్యకు గురైనారని, శవాలు కుళ్లిపోయాయని దావణగెరె పోలీసు అధికారులు చెప్పారు.

ఎవరెవరు వచ్చారు ?

ఎవరెవరు వచ్చారు ?

రాధమ్మ, గౌరమ్మ నివాసం ఉంటున్న ఇంటికి ఎవరెవరు వచ్చి వెళ్లారు ? అని పోలీసులు ఆరా తీస్తున్నారు. రాధమ్మ, గౌరమ్మ మొబైల్ నెంబర్ ఫోన్లకు ఎవరెవరు ఫోన్లు చేశారు ?, వీరిలో ఎవరికైనా అక్రమ సంబంధం ఉందా ?, మాజీ భర్తల్లో ఎవరైనా హత్య చేశారా ? అంటూ పోలీసులు అనేక కోణాల్లో ఆరా తీస్తున్నారు. అందంగా ఉన్న అక్కాచెల్లి రాధమ్మ, గౌరమ్మ ఒకే రోజు దారుణ హత్యకు గురి కావడం దావణగెరెలో కలకలం రేపింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+