సెక్స్ స్కాండల్ వీడియోలోని ఆ ఆడియో ఎవరిది ?, ఎంపీని ఇబ్బందులకు గురి చేస్తున్న వాయిస్ ?
సెక్స్ స్కామ్ కేసులో హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను అరెస్టు చేస్తే వాయిస్ పరీక్షలు నిర్వహించే అంశాన్ని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) పరిశీలిస్తోంది. తద్వారా పెన్ డ్రైవ్‌లోని అశ్లీల వీడియోల్లో ఉన్న ఆపురుషుడి స్వరం ఎవరిదో అనే విషయం తేలిపోతుందని అధికారులు అంటున్నారు. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను ఇప్పుడు ఆ వీడియోలోని ఆడియో తీవ్ర ఇబ్బందులకు గురిచేసే అవకాశం ఉంది.
పెన్ డ్రైవ్‌లోని అశ్లీల వీడియోలలో వినిపించే పురుషుడి వాయిస్‌తో ఈ వాయిస్ టెస్ట్‌ను పోల్చడం ద్వారా అత్యాచారం జరిగినట్లు నిరూపించేందుకు సిట్‌కి ముఖ్యమైన వైద్యపరీక్షలు సాక్ష్యంగా లభిస్తుందని సంబంధిత అధికారులు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ వాయిస్ టెస్ట్ చాలా కీలకమని, వైద్యపరీక్షల అనంతరం కేసు ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న హాసన్ ఎంపీ ప్రజ్వల్ ఇదే మే 31వ తేదీన విదేశాల నుంచి భారత్‌కు తిరిగి రావడానికి విమానం టిక్కెట్టు బుక్ చేసుకున్నారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు హాసన్‌లో ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించిన అశ్లీల వీడియోలు సోషల్ మీడియాలో విడుదల కావడం సంచలనం సృష్టించింది. లైంగిక వేధింపుల కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ ఇప్పుడు పెన్ డ్రైవ్‌లలో లోడ్ చేసిన అశ్లీల వీడియోలను స్వాధీనం చేసుకుంది.
ఆ అశ్లీల వీడియోలు ఎవరివి అని పరిశీలించడానికి ఆ పెన్ డ్రైవ్ ను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. ఇప్పుడు ఎఫ్‌ఎస్‌ఎల్ నివేదిక కోసం సిట్ ఎదురుచూస్తోంది. హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ అశ్లీల వీడియోల అని చెప్పుకుంటున్న ఆ వీడియోల్లో ఓ పురుష స్వరం ఉంది. కొన్ని అశ్లీల వీడియోలలో పురుష స్వరం వినిపిస్తుంది. ఆ వ్యక్తి కొంతమంది బాధితులతో మాట్లాడిన సంభాషణల క్లిప్పింగ్స్ ఉన్నాయి. కానీ వీడియోల్లో మాట్లాడుతున్న అతని ముఖాన్ని గుర్తించడానికి సాద్యం కావడం లేదని తెలిసింది.
లైంగిక వేధింపులు, అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ గొంతును వీడియోల్లో మాట్లాడిన పురుషుడితో పోల్చడానికి వాటిని ల్యాబ్ కు పంపిస్తున్నారు. రెండు స్వరాలలో పోలిక కనిపిస్తే హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై వస్తున్న ఆరోపణలను రుజువు చేయడానికి వైద్యపరీక్షల ఆధారాలు పనికొస్తాయని అధికారులు అంటున్నారు. వైద్యపరీక్షల నివేదికను కూడా కోర్టుకు సమర్పించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
లైంగిక వేధింపుల కేసు తర్వాత విదేశాల్లో అజ్ఞాతంలో ఉన్న ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ మే 31వ తేదీన స్వదేశానికి తిరిగి వచ్చి సిట్ ఎదుట హాజరవుతానని ఇటీవల ఓ వీడియో స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఈ ప్రకటన తర్వాత ప్రజ్వల్‌పై తదుపరి విచారణ చర్యలకు కూడా సిట్ సిద్ధమైంది. హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు ఇతర వైద్య పరీక్షలు నిర్వహించడానికి సిట్ సిద్దం అవుతోందని తెలిసింది.
లైంగిక వేధింపుల కేసుకు సంబంధించి ప్రజ్వల్ రేవణ్ణకు కొన్ని వైద్యపరీక్షలతో పాటు వాయిస్ టెస్ట్ కూడా నిర్వహించాల్సి ఉంటుందని సమాచారం. ప్రజ్వల్‌ని అరెస్ట్ చేస్తే బెంగళూరులోని బౌరింగ్ ఆస్పత్రి లేదా విక్టోరియా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. మొత్తం మీద హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ భారతదేశానికి తిరిగిరావడానికి కౌంట్ డౌన్ మొదలైయ్యింది. ఈ అశ్లీల వీడియో కేసు ఎక్కడి నుంచి ఎక్కడికి దారితీస్తుందో అనే విషయం వేచిచూడాలి అంటున్నారు కొందరు జేడీఎస్ కార్యకర్తలు.












Click it and Unblock the Notifications