Shock: విదేశాల్లో భర్త, భార్య నోటికి ప్లాస్టర్ వేసి, చేతులు కాళ్లు కట్టేసి, కరెంట్ షాక్ ఇచ్చి !

చెన్నై/మదురై: వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేశారు. దంపతులకు ఓ కూతురు, కొడుకు ఉన్నారు. భర్త విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నాడు. డబ్బులు బాగా సంపాధిస్తున్న భర్త అతని భార్యకు పంపిస్తున్నారు. సొంత ఊర్లో మహిళ ఆమె కూతురు, కొడుకుతో కలిసి నివాసం ఉంటున్నది. ఉదయం మహిళ ఇంటికి వెళ్లిన ఇద్దరు వ్యక్తులు మేము మీ భర్తతో పాటు విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నామని పరిచయం చేసుకున్నారు. తాగడానికి మంచి నీళ్లు ఇవ్వాలని మహిళకు చెప్పారు. మహిళ వంట గదిలోకి వెళ్లిన వెంటనే నిందితులు ఆమెను గట్టిగా పట్టుకుని నోటి ప్లాస్టర్ వేశారు. కదలకుండా కాళ్లు, చేతులు కట్టేశారు.

 దంపతుల కాపురం

దంపతుల కాపురం

తమిళనాడులోని మదురై జిల్లాలోని మేలూరు సమీపంలోని వాచంపట్టి ప్రాంతంలో షణ్ముగ సుందరం అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం షణ్ముగ సుందరం హేమలత అనే మహిళను వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న సుందరం, హేమలత దంపతులు సంతోషంగా కాపురం చేశారు.

 ఖతార్ లో ఉద్యోగం చేస్తున్న భర్త

ఖతార్ లో ఉద్యోగం చేస్తున్న భర్త

కొన్ని సంవత్సరాల క్రితం సుందరం ఖతార్ లో ఉద్యోగం చెయ్యడానికి వెళ్లాడు. ప్రతి సంవత్సరం సుందరం సొంత ఊరికి వచ్చి భార్య హేమలత, పిల్లలతో కొంతకాలం గడిపి తరువాత ఖతార్ వెళ్లిపోతున్నాడు. డబ్బులు బాగా సంపాధిస్తున్న సుందరం అతని భార్య హేమలతకు పంపిస్తున్నారు. సొంత ఊర్లో కూతురు, కొడుకుతో కలిసి హేమలత నివాసం ఉంటున్నది.

 మహిళ దగ్గర భారీగా నగదు, నగలు ఉన్నాయని ?

మహిళ దగ్గర భారీగా నగదు, నగలు ఉన్నాయని ?

హేమలత దగ్గర భారీ మొత్తంలో నగదు, నగలు ఉన్నాయని ఆ ప్రాంతంలోని వాళ్లకు తెలుసు. ఉదయం మహిళ ఇంటికి వెళ్లిన ఇద్దరు వ్యక్తులు మేము మీ భర్త సుందరంతో కలిసి ఖతార్ లో ఉద్యోగం చేస్తున్నామని పరిచయం చేసుకున్నారు. ఓ వ్యక్తి తన పేరు కుమార్ అని హేమలతకు చెప్పాడు. తాగడానికి మంచి నీళ్లు ఇవ్వాలని హేమలతకు చెప్పారు.

 కాళ్లు, చేతులు కట్టేసి కరెంట్ షాక్ ఇచ్చి ?

కాళ్లు, చేతులు కట్టేసి కరెంట్ షాక్ ఇచ్చి ?

హేమలత నీళ్లు తీసుకురావడానికి వంట గదిలోకి వెళ్లిన వెంటనే నిందితులు ఆమె కేకలు వెయ్యకుండా గట్టిగా పట్టుకుని నోటి ప్లాస్టర్ వేశారు. హేమలత కదలకుండా కాళ్లు, చేతులు కట్టేశారు. హేమలతకు కరెంట్ షాక్ ఇచ్చిన నిందితులు మెడ మీద కత్తి పెట్టి ఆమె శరీరం మీద ఉన్న 11 తులాల బంగారు నగలు, బీరువాలో ఉన్న రూ. 70 వేల నగదు లూటీ చేసి ఇంటి బయట తాళం వేసి పరారైనారు, మద్యాహ్నం బంధువుల సహాయంతో హేమలత పోలీసులకు ఫిర్యాదు చేసింది. హేమలత గురించి పూర్తిగా తెలిసిన వాళ్లు ఇలా చేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+