కుప్పకూలిన స్మాల్ ట్రైనర్ ఎయిర్‍‌క్రాఫ్ట్: గాయాలతో బయటపడ్డ మహిళా పైలట్

ముంబై: మహారాష్ట్రలోని పుణె జిల్లాలో ఓ ప్రైవేట్ ఏవియేషన్ స్కూల్‌కు చెందిన చిన్న విమానం సోమవారం కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలోని మహిళా పైలట్ గాయపడ్డారు. ఈ మేరకు వివరాలను పోలీసులు వెల్లడించారు.

ఇందాపూర్ తహసీల్‌లోని కడ్బన్‌వాడి వద్ద సోమవారం ఉదయం 11.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని చెప్పారు. పుణెలోని బారామతి విమానాశ్రయం నుంచి ప్రైవేట్ ఏవియేషన్ స్కూల్‌కు చెందిన విమానం బయలుదేరిందని ఆయన తెలిపారు.

Small Trainer Aircraft Crashes In Pune, Pilot Injured

ఈ ప్రమాదంలో పైలట్ భావా రాథోడ్‌కు స్వల్ప గాయాలయ్యాయి. చికిత్స కోసం ఆసుపత్రిలో చేరారు. అయితే, ఆ విమానం బాగా దెబ్బతిన్నట్లు పోలీసు అధికారులు తెలిపారు.

విమానం కూలిపోవడంతో స్థానిక జనాలు మొదట భయాందోళనకు గురయ్యారు. ఆ తర్వాత ఘటనా స్థలానికి వెళ్లి విమానంలోని మహిళా పైలట్‌ను బయటకు తీసుకొచ్చారు. చిన్నగాయాలతోనే మహిళా పైలట్ బయటపడటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+