వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రముఖ సామాజిక కార్యకర్త ఇలినా సేన్ కన్నుమూత

|
Google Oneindia TeluguNews

రాయ్‌పూర్: ప్రముఖ సామాజిక కార్యకర్త, రచయిత ఇలినా సేన్(69) కన్నుమూశారు. డాక్టర్, హక్కుల ప్రచారకుడు బినాయక్ సేన్ భార్య అయిన ఇలినా సేన్.. గత కొంత కాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ ఆదివారం తుది శ్వాస విడిచారు.

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మైన్ వర్కర్ ట్రేడ్ యూనియన్స్‌.. కార్పొరేటైజేషన్‌కు వ్యతిరేకంగా, గిరిజనుల హక్కుల కోసం ఇలినా సేన్ పోరాటం చేసి విజయం సాధించారు. ఇలినా సేన్ పలు పుస్తకాలను కూడా రాశారు.

 Social activist and author Ilina Sen passes away

ఇన్‌సైడ్ ఛత్తీస్‌గడ్: ఎ పొలిటికల్ మెమోయిర్, సుఖ్వాసిన్: ది మైగ్రాంట్ వుమెన్ ఆఫ్ ఛత్తీస్‌గఢ్ అనే పుస్తకాలను రాశారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో సాల్వా జుడుమ్, కోయా కమాండోస్ కు వ్యతిరేకంగా తన భర్తతో కలిసి ఇలినా సేన్ పోరాటం చేశారు.

ఇలినా సేన్ తన భర్త ఎన్జీవో సంస్థ రూపాంతర్‌లో కీలకంగా వ్యవహరించారు. మారుమూల ప్రాంతాల్లోని ప్రజలకు వైద్య సేవలు అందించారు. మహారాష్ట్ర వార్ధాలోని మహాత్మా గాంధీ ఇంటర్నేషనల్ హిందీ యూనివర్సిటీలో ఆమె బోధించారు.

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మావోయిస్టులకు మద్దతు పలకడంతోపాటు సాయం చేశారని ఇలినా సేన్ భర్త బినాయక్ ఆరోపణలున్నాయి. అంతేగాక, 2010లో కోర్టులో ఆయనపై దేశద్రోహం, కుట్రలు రుజువు అయ్యాయి. నక్సల్ నాయకుడు సన్యల్, ఓ వ్యాపారవేత్తకు మధ్య కొరియర్ పనిచేసిన నేరం కింద ఆయన రెండేళ్లపాటు జైలు శిక్ష అనుభవించారు.

English summary
Known for her dedicated work as an activist in Chhattisgarh, Ilina Sen, wife of doctor and rights campaigner Binayak Sen, passed away on Sunday at the age of 69 after a long battle with cancer.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X