Solar Eclipse:తొలి హైబ్రీడ్ సూర్యగ్రహణం ప్రత్యేకతలివే..!
Solar Eclipse:ఈ ఏడాది మొదటి సూర్యగ్రహణం ఏప్రిల్ 20వ తేదీన సంభవిస్తుంది. అసలు సూర్యగ్రహణం అంటే ఏంటి..? సూర్యుడికి భూమికి మధ్యలో చంద్రుడు వచ్చి సూర్యుడిని అడ్డుకోవడాన్ని సూర్యగ్రహణం అని పిలుస్తారు. ఇక ఈ సూర్యగ్రహణం వైశాఖ అమావాస్య రోజున సంభవిస్తుంది. భారత్‌లో మాత్రం గ్రహణం కనిపించదు.2023లో మొత్తం నాలుగు గ్రహణాలు ఏర్పడుతాయి. ఇందులో రెండు సూర్యగ్రహణాలు రెండు చంద్రగ్రహణాలు.
ఏప్రిల్ 20వ తేదీన వైశాఖ అమావాస్య రోజున ఏర్పడే సూర్యగ్రహణం హైబ్రిడ్ సూర్యగ్రహణం.ఇక ఈ ఏడాది తొలి సూర్యగ్రహణం ఉదయం 7గంటల 4 నిమిషాలకు ప్రారంభమై మధ్యాహ్నం 12 గంటల 29 నిమిషాలకు ముగుస్తుంది.అయితే భారతీయ జ్యోతిష్య క్యాలెండర్ ప్రకారం ఈ సూర్యగ్రహణం మన దేశంలో కనిపించదు. ఆస్ట్రేలియా, తూర్పు దక్షిణాసియా, పసిఫిక్ మహాసముద్రం, అంటార్కిటికా, హిందూ మహాసముద్రంలో కనిపిస్తుంది. చివరిగా ఇండోనేషియాలోని పపువా ప్రావిన్స్‌లోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కనిపించనుంది.

ఏప్రిల్ 20వ తేదీన సంభవించే సూర్యగ్రహణం తర్వాత సరిగ్గా 15 రోజులకు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఇక రెండవ సూర్యగ్రహణం ఈ ఏడాది అక్టోబర్ 14న సంభవిస్తుంది. ఇది కూడా భారత్‌లో కనిపించదని సమాచారం.గ్రహణం యొక్క ఇరుకైన మార్గంను బట్టి దీన్ని హైబ్రిడ్ గ్రహణం అని పిలుస్తున్నారు. ఇందుకే దీన్ని అరుదైన గ్రహణంగా పరిగణిస్తున్నారు.ఇక సంపూర్ణ సూర్యగ్రహణం పశ్చిమ ఆస్ట్రేలియాలోని నార్త్ వెస్ట్ కేప్‌లో దర్శనమిస్తుంది.
భారత దేశంలో ఈ సూర్య గ్రహణం కనిపించదు కాబట్టి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుభకార్యాలపై ఎలాంటి ప్రభావం ఉండదని జ్యోతిష్యశాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంటే గ్రహణం ఏర్పడటానికి ముందు నుంచి గ్రహణం ముగిసే వరకు ఉన్న సమయాన్ని అశుభమైనదిగా పరిగణిస్తారు. ఈ సమయంలో ఎలాంటి శుభకార్యాలు చేయకూడదని పండితులు చెబుతారు.ఒకవేళ కాదని శుభకార్యాలు జరిపిస్తే అశుభ ఫలితాలు వస్తాయని విశ్వసిస్తారు.












Click it and Unblock the Notifications