2024 సంపూర్ణ సూర్యగ్రహణం; ఆసక్తికర విషయాలు; భారతదేశంలో కనపడుతుందా?
2024 సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం ఏప్రిల్ 8వ తేదీన ఏర్పడబోతుందని మనకందరికీ తెలిసిన విషయమే. 2024 సంవత్సరంలో త్వరలో ఈ ఖగోళ దృశ్యాన్ని వీక్షించే అవకాశం కోసం చాలామంది ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. అయితే జ్యోతిష్య ప్రకారం చూస్తే భారతదేశంలో అయినా, భారతదేశం వెలుపల అయినా ఎక్కడ జరిగినా కూడా అది ప్రతికూలమైన ప్రభావాన్ని కలిగిస్తుంది. సూర్య గ్రహణం ఈసారి అమావాస్య నాడు రావటంతో దీనికి చాలా ప్రాధాన్యత ఉంటుంది.
అసలు సూర్య గ్రహణం ఎందుకు ఏర్పడుతుంది? సూర్యగ్రహణం వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. క్షీరసాగరాన్ని మధించినప్పుడు వచ్చిన అమృతాన్ని మోహిని రూపంలో ఉన్న విష్ణువు దేవతలకు పంచిపెట్టారు. అయితే దేవతలతో పాటు స్వర్భానుడు అనే రాక్షసుడు అమరత్వం పొందడానికి అమృతాన్ని తాగే ప్రయత్నం చేశాడు. ఇక ఈ విషయం విష్ణువు సూర్యుడు, చంద్రుడు ద్వారా తెలుసుకొని స్వర్భానుడి శిరస్సు చేధించాడు.

ఇక వారే రాహుకేతువులు గా మారారు. తల రాహువు గా, మొండెం కేతువుగా మారారని చెబుతారు. అయితే సూర్యుడు ఈ రెండు గ్రహాల ప్రభావంలోకి వచ్చినప్పుడల్లా సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఇక ఈ సంవత్సరం సంపూర్ణ సూర్యగ్రహణం మీన రాశి మరియు రేవతి నక్షత్రంలో చైత్రమాసంలో జరగబోతోంది. ఇది ఈ సంవత్సరం మొట్టమొదటి సంపూర్ణ సూర్యగ్రహణం.
ఇది ఏప్రిల్ ఎనిమిదవ తేదీన మధ్యాహ్నం 12.12 నిమిషాలకు ప్రారంభమై ఏప్రిల్ 9వ తేదీన తెల్లవారుజామున 2 గంటల 22 నిమిషాలకు ముగుస్తుంది. అయితే భారతదేశంలో ఈ సంపూర్ణ సూర్యగ్రహణం కనిపించే అవకాశం లేదు. కానీ యూఎస్ లోని 13 రాష్ట్రాల్లో సంపూర్ణ సూర్యగ్రహణాన్ని చూడొచ్చు.
ఈ సంపూర్ణ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు. కాబట్టి ఈ సూర్యగ్రహణానికి సూతక కాలం కూడా లేదని చెబుతున్నారు.అయితే సాధారణంగా సూతక కాలం గ్రహణానికి 12 గంటల ముందు ప్రారంభం అవుతుంది. ఈ సమయంలో పూజలు, శుభకార్యాలే కాదు కొన్ని పనులు చేయటం నిషిద్ధం అని చెప్తారు.












Click it and Unblock the Notifications