కొన్నింటికే అనుమతి: మరికొన్నింటికి నో, తెరిచే షాపులేవీ, క్లోజ్ కంటిన్యూ అయేవి ఏవీ.. ఆ జాబితా ఇదే...
కరోనా వైరస్ వ్యాపిస్తోన్న నేపథ్యంలో మార్చి 24వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. మే 3వ తేదీ వరకు లాక్‌డౌన్ అమలవుతోంది. ఇప్పటివరకు మెడికల్ షాపులు పూర్తిగా, కిరాణా షాపులు పరిమితంగా కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. అయితే శుక్రవారం అర్ధరాత్రి కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాపార, వాణిజ్య సముదాయాలు తెరిచేందుకు అనుమతించింది. అందుకు గల షరతులు కూడా విధించింది. దీంతో ఏయే షాపులు ఓపెన్ ఉంటాయో, ఏవీ మూసివేస్తారో తెలుసుకుందాం.. పదండి.
Recommended Video

50 శాతం సిబ్బంది
రద్దీ దృష్ట్యా మున్సిపాలిటీ పరిధి ముగిసిన తర్వాత గల నివాస సముదాయాల్లో ఉన్న వ్యాపార, వాణిజ్య సముదాయలు తెరిచేందుకు అనుమతి ఇచ్చింది. మున్సిపాలిటీలో గల మల్టీ బ్రాండ్, సింగిల్ బ్రాండ్ మాల్స్ తెరవబోమని స్పష్టంచేసింది. కరోనా వైరస్ హాట్ స్పాట్, కంటైన్మెంట్ జోన్లలో పరిస్థితి యథతథాంగా కొనసాగుతోందని పేర్కొన్నది. ఏప్రిల్ 15వ తేదీన ఇచ్చిన ఉత్తర్వులకు కేంద్ర హోంశాఖ సవరణలు చేసింది. ఆయా వ్యాపార సముదాయాల్లో 50 శాతం సిబ్బంది మాత్రమే పనిచేయాలని షరతు విధించింది. దీంతోపాటు వారు మాస్క్ వేసుకొని, సామాజిక దూరం పాటించాలని స్పష్టంచేసింది.

మద్యం షాపులకు నో..
ఆయా షాపు యాజమానులు తమ 50 శాతం మంది సిబ్బంది జాబితాతో.. మాస్క్ వేసుకొని, సామాజిక దూరం పాటిస్తామని కేంద్ర హోంశాఖకు దరఖాస్తు చేసుకోవాలి. హాట్ స్పాట్, కంటైన్మెంట్ జోన్లలో ఏ వ్యాపార సముదాయం తెరుచుకోదు అని స్పష్టంచేసింది. మద్యం షాపులు కూడా తెరబోమని స్పష్టంచేసింది.

ఓపెన్ చేసేవి ఇవే:
1. రాష్ట్ర/కేంద్రపాలిత ప్రాంతంలో రిజిష్ర్ చేసుకున్న షాపులు తెరిచేందుకు అనుమతించారు. కానీ మున్సిపాలిటీ దాటిన దాటి, అక్కడ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ ఉంటే మాత్రం తెరవడానికి అనుమతిస్తారు.
2.మునిసిపల్ కార్పొరేషన్, మునిసిపాలిటీలో పరిమిత స్థాయిలో షాపులకు పర్మిషన్ ఇచ్చారు.
3. ఆయా వ్యాపార సముదాయాల్లో 50 శాతం సిబ్బందికి మించి పనిచేయొద్దనే నిబంధన విధించారు. వారు మాస్క్ వేసుకొని.. సోషల్ డిస్టన్స్ పాటించాలని సూచించారు
4.సెల్లూన్లు, బ్యూటీపార్లర్ తెరిచేందుకు అనుమతించారు. దీంతో సెలూన్లు తెరవాలని కోరుకునేవారికి ఉపశమనం కలిగింది.
5.గ్రామీణ, సెమీ రూరల్ ప్రాంతాల్లో అన్ని మార్కెట్ సముదాయాలు తెరిచేందుకు ఓకే
6.పట్టణ ప్రాంతాల్లో గల నివాస సముదాయాల్లో ఇతర వస్తువుల కొనుగోలు అందుబాటులోకి వస్తాయి.
7.గ్రామాల్లో అత్యవసరం కానీ సరుకులను కూడా అన్ని షాపుల్లో విక్రయించేందుకు అనుమతిచ్చారు.
8.మున్సిపాలిటీ పరిధి దాటక అన్ని మార్కెట్ కాంప్లెక్స్ తెరిచేందుకు అనుమతి.
9. వైరస్ ఉన్న ప్రాంత సమీపంలో గల ప్రాంతాల్లో ఉన్న షాపులు తెరిచేందుకు అనుమతి

క్లోజ్ చేసేవి ఇవే..
1. మున్సిపాలిటీ/ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి దాటకా గల మల్టీ బ్రాండ్, సింగిల్ బ్రాండ్ షాపింగ్ మాల్స్ తెరిచేందుకు అనుమతి లేదు.
2. మున్సిపాలిటీ/ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మల్టీ బ్రాండ్, సింగిల్ బ్రాండ్ షాపింగ్ మాల్స్ క్లోజ్ కొనసాగుతోంది.
3.సినిమా హాళ్లు, మాల్స్, షాపింగ్ కాంప్లెక్స్, జిమ్స్, సోర్ట్స్ కాంప్లెక్స్, స్విమ్మింగ్ పూల్, ఎంటర్ టైన్ మెంట్ పార్క్, థియేటర్లు, బార్లు, ఆడిటోరియం తెరవరు.
4.పెద్ద షాపులు, వ్యాపార సముదాయాలకు కూడా తెరిచేందుకు అనుమతి లేదు.
5.చిన్న పట్టణ ప్రాంతాల్లో మార్కెట్ కాంప్లెక్స్ కూడా మూసివేస్తారు.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్‌కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications