వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

క్షమించండి: 'ద బిగ్ బిలియన్ డే'పై ఫ్లిప్‌కార్ట్, మరోసారి..

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: బిగ్ బిలియన్ డే ద్వారా వినియోగదారులను సంతృప్తి పరచడంలో విఫలమయ్యామని, అనుకున్నస్థాయిలో పనితీరును కనబర్చలేకపోయామని దేశీయ ఇ-కామర్స్ దిగ్గజం ప్లిఫ్‌కార్డ్ అంగీకరించింది. ఇందుకుగాను ప్రతి ఒక్క వినియోగదారుడికి క్షమాపణ చెబుతున్నట్లు తెలిపింది.

మరోసారి ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించదలిస్తే పూర్తి సన్నద్దతతో చేస్తామని హామీ ఇచ్చింది. సోమవారం బిగ్ బిలియన్ డే పేరుతో భారీ తగ్గింపు ఆఫర్లను కంపెనీ అందించిన విషయం తెలిసిందే. దీనికి వినియోగదారుల నుండి మంచి స్పందన లభించింది. అయితే, వెబ్‌సైట్ క్రాష్ అయింది.

Sorry, say Flipkart founders

అంతేకాదు మధ్యాహ్నానికి ఉత్పత్తుల నిల్వలు తగినంతగా లేవు. దీంతో వినియోగదారులు ఇబ్బంది పడ్డారు. ఈ విషయమై ఫ్లిప్‌కార్డ్ వ్యవస్థాపకులు సచిన్ బన్సాల్, బిన్నీ బన్సాల్ వినియోగదారులకు ఇ-మెయిల్ పంపారు.

కాగా, దీపావళి పర్వదినం సందర్భంగా ఈ నెల 10వ తేదీ నుండి 16వ తేదీ వరకు ఫ్లిప్‌కార్డ్ మరో ఆఫర్‌ను ఇచ్చే ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. సోమవారం ఫ్లిప్‌కార్ట్ ఆరువందల కోట్ల రూపాయల బిజినెస్ జరిపినట్లు ప్రకటించింది. ఫ్లి‌ప్కార్ట్ సైట్ క్రాష్ కావడం... భారీ డిస్కౌంట్ ప్రకటించడంతో వినియోకదారులు పక్క సైట్లను కూడా సందర్శించారు. దీంతో ఆ సైట్లకు కూడా భారీ బిజినెస్ జరిగింది.

English summary
A day after the failure of the much-touted the Big Billion Day deal from the online retailer Flipkart, founders Sachin Bansal and Binny Bansal have apologised for the troubles the customers faced on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X