భలే ఛాన్స్.. తక్కువ ధరకే దక్షిణాది ఆలయాల టూర్ .. IRCTC ప్రత్యేక ప్యాకేజీ

భారత్ లో ప్రముఖ దేవాలయాలు ఎన్నో ఉన్నాయి. ఒక్కో ఆలయానికి ఎంతో ప్రత్యేకత ఉంది. అయితే బడ్జెట్, సమయం లేకపోవడం కారణంగా చాలా మంది దేవాలయాల సందర్శనను వాయిదా వేస్తుంటారు. అయితే తక్కువ ధరకే ప్రముఖ దేవాలయాలను సందర్శించేందుకు వీలుగా IRCTC ప్రత్యేక ప్యాకేజీ అందిస్తోంది. రైల్వే శాఖ కీలక నిర్ణయంతో తక్కువ ధరలోనే ఫేమస్ టెంపుల్స్ చూసేందుకు పర్యటకులు ఆసక్తి చూపిస్తున్నారు.

బడ్జెట్ లోనే దక్షిణాది ఆలయాలను సందర్శించే గొప్ప అవకాశం. ఇండియన్​ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్​(IRCTC).. టూరిస్టులు, భక్తుల కోసం తక్కువ ధరకే ఎప్పటికప్పుడు కొత్త టూర్ ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకువస్తున్న విషయం తెలిసిందే. తాజాగా దక్షిణ్ దర్శన్ యాత్ర పేరుతో IRCTC ప్రత్యేక ప్యాకేజీని తీసుకొచ్చింది. ఈ ప్యాకేజీ మొత్తం 11 పగళ్లు, 10 రాత్రులు ఉంటుంది. ఈ టూర్ జనవరి 17, 2026 న రేవా నుంచి ప్రారంభం అవుతుంది.

IRCTC అందిస్తున్న ఈ ప్రత్యేక ప్యాకేజీలో 2 జ్యోతిర్లింగాలను దర్శించుకోవచ్చు. అలాగే ప్రముఖ పుణ్యక్షేత్రాలు అయిన తిరుపతి, రామేశ్వరం, మధురై, కన్యాకుమారి, శ్రీశైలం తదితర ప్రాంతాలను సందర్శించవచ్చు. ఈ రైలు రేవా, సత్నా, మైహార్, కట్నీ, జబల్ పూర్, నర్సింగ్ పూర్, ఇటార్సీ, బేటుల్, నాగ్ పూర్, సేవాగ్రామ్ స్టేషన్స్ మీదుగా వెళ్తుంది. రైలు టిక్కెట్లు, బస్ సర్వీస్, హోటల్ లో బస, ఆహారం, దేవాలయాలను సందర్శించే టిక్కెట్లు అన్నీ ఒకే ప్యాకేజీలోనే ఉంటాయి.

South India Spiritual Sojourn IRCTC s Dakshin Darshan Yatra Package from Just 20 000

ఈ ప్యాకేజీ ధర రూ. 20, 400 నుంచి ప్రారంభం అవుతుంది. ఇది ఎకానమీ క్లాస్. అలాగే 3ఏసీ స్టాండర్డ్ క్లాస్ రూ. 33, 700 నుంచి స్టార్ట్ అవుతుంది. 2ఏసీ కంఫోర్ట్ క్లాస్ ధర రూ. 44, 500 నుంచి ప్రారంభం అవుతుంది. ఇక టికెట్స్ బుకింగ్ కోసం IRCTC ప్రత్యేక వెబ్‌సైట్ లోకి వెళ్లాలి. ఆన్ లైన్ వేదికగా బుకింగ్ చేసుకోవాలి. ఇక ప్యాకేజీకి సంబంధించిన పూర్తి సమాచారం కోసం వాళ్లతో ఫోన్ లో సంప్రదించవచ్చు.. లేదా www.irctctourism.com వెబ్ సైట్ ను సంప్రదించవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+