సోనూ సూద్‌కు అరుదైన గౌరవం -స్పైస్ జెట్ విమానంపై రక్షకుడి బొమ్మ -నాడు రిజర్వేషన్ లేని ప్రయాణం

గొప్పలు చెప్పుకునే రాజకీయ నేతలంతా సిగ్గుతో తలదించుకునేలా.. కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలన్నీ చేతులు ముడుచుకుని కూర్చోన్నా.. కరోనా కష్టకాలంలో దేశానికి తానున్నానంటూ ఆపద్భాదవుడిలా.. పేద, వలస కూలీలపాలిట రక్షకుడిగా సోనూ సూద్ చేసిన సేవలను సామాన్యులెవరూ మర్చిపోలేరు. కరోనా విలయం తర్వాత కూడా చేతిక ఎముక లేద‌న్న‌ట్టుగా వీలైనంతలో పేదలకు సాయం చేసుకుంటూ వెళుతున్నారు న‌టుడు సోనూసూద్. అలాంటి వ్యక్తికి..

Recommended Video

    #SonuSood : రిజర్వేషన్ లేకుండా చేసిన విమాన ప్రయాణాన్నీ గుర్తు చేసుకుని Sonu Sood Emotional

    కష్టకాలంలో సాటి మనిషికి సాయపడిన సోనూ సూద్ ను 'రక్షకుడు'గా అభివర్ణిస్తూ, ఆయన చేసిన సేవలకు గౌరవంగా దేశీయ విమానయాన సంస్థ స్పైస్ జెట్ బోయింగ్ 737 విమానం మీద సోనూ సూద్ బొమ్మను ముద్రించింది. సోనూ బొమ్మతో 'ఆప‌ద్భాంద‌వుడికి వందనం' అని రాసున్న విమానం తాలూకు ఫొటోలు వైరల్ గా మారాయి.

    SpiceJet honours Sonu Sood with special aircraft livery, actor remembers an Unreserved journey

    త‌న‌కు ద‌క్కిన అరుదైన గౌర‌వంపై సోనూసూద్ సైతం స్పందించారు. తన తల్లిదండ్రులు బతికుంటే ఈ దృశ్యాన్ని చూసి ఎంతో గర్వపడేవారని అన్నారు. అంతేకాదు, గతంలో రిజర్వేషన్ లేకుండా తాను చేసిన విమాన ప్రయాణాన్నీ ఆయన గుర్తు చేసుకున్నారు.

    SpiceJet honours Sonu Sood with special aircraft livery, actor remembers an Unreserved journey

    ''గతంలో ఓసారి మొగా నుండి ముంబైకి రిజ‌ర్వేష‌న్ లేకుండా విమానంలో ప్రయాణించాను. ఇప్పుడు నాకు ఇలాంటి గుర్తింపు వ‌చ్చేలా చేసిన మీ అంద‌రికి ధ‌న్య‌వాదాలు. అమ్మానాన్నలను మరింత మిస్ అవుతున్నాను. ఇకమీదట కూడా నా పనిని కొనసాగిస్తాను'' అని సోనూ సూద్ ఓ ఎమోషనల్ ట్వీట్ చేశారు. సోనూ తల్లి సరోజ్ సూద్ 2007 లో చనిపోగా, తండ్రి శక్తి సూద్ 2016 లో మరణించారు. తండ్రి పేరుతో సోనూ ఓ ప్రొడక్షన్ హౌజ్ నడుపుతోన్న సంగతి తెలిసిందే.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+