బెంగళూరులో మరో షాకింగ్: అమ్మాయి పెదాలు, నాలుక కొరికి వెళ్లాడు
కళ్లు తప్ప మరేమీ కనిపించకుండా నిండా దుస్తులు కప్పుకున్న ఓ యువతిని వ్యక్తి వేధించాడు. ఆమె పెదవులు, నాలుక కొరికాడు.
బెంగళూరు: అమ్మాయిలు వేసుకుంటున్న దుస్తుల వల్లే అఘాయిత్యాలు, అత్యాచారాలు పెరిగిపోతున్నాయని చాలామంది చెబుతున్నారు. బెంగళూరులో న్యూ ఇయర్ వేడుకల సమయంలో అమ్మాయిల వేధింపు దేశవ్యాప్తంగా కలకలం రేపింది.
అదే బెంగళూరులో అమ్మాయిల పైన దారుణాలు కొనసాగుతున్నాయి. కళ్లు తప్ప మరేమీ కనిపించకుండా నిండా దుస్తులు కప్పుకున్న ఓ యువతిని వ్యక్తి వేధించాడు. ఆమె పెదవులు, నాలుక కొరికాడు.
దాంతో పాటు అతడిని ప్రతిఘటించే ప్రయత్నంలో ఆమె చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. ఈ ఘటన సమీపంలో ఉన్న ఓ ఇంటి వద్ద అమర్చిన సీసీ కెమెరాల్లో రికార్డయింది. బస్టాపుకు సమీపంలో ఈ సంఘటన జరిగింది.

కాసేపటి తర్వాత అతను అక్కడి నుంచి పారిపోయాడు. అతడు ఆమె పైన అఘాయిత్యం చేయడానికి ప్రయత్నించి, అక్కడ ఉన్న కుక్కలు మొరగడంతో.. ఎవరైనా వస్తారేమోనని భయపడి పారిపోయాడు. గాయపడిన ఆమెను ఆసుపత్రికి తరలించారు. పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications