అర్ధరాత్రి అరుదైన చంద్రగ్రహణం.. ఇదే చివరిది!!

న్యూఢిల్లీ: చంద్ర గ్రహణం కనువిందు చేసింది. చంద్రుడు పాక్షికంగా గ్రహణ ఛాయల్లోకి వెళ్లాడు. ఈ ఏడాది చివరి గ్రహణం ఇదే. శరద్ పౌర్ణమితో కలిసి వచ్చిన ఈ సెలెస్టియల్ ఈవెంట్‌.. దేశవ్యాప్తంగా కనువిందు చేసింది. ఏపీ, తెలంగాణ సహా అన్ని రాష్ట్రాల్లోనూ చంద్ర గ్రహణాన్ని వీక్షించారు స్టార్ గేజర్స్.

అర్ధరాత్రి దాటిన తరువాత 1:05 నిమిషాలకు గ్రహణ కాలం ఆరంభమైంది. గంటా 20 నిమిషాల పాటు కొనసాగింది. 1:44 నిమిషాలకు గ్రహణ ఛాయ అత్యధికంగా కనిపించింది. ఆ తరువాత గ్రహణం వీడటం ఆరంభమైంది. 2:22 నిమిషాలకు పూర్తిగా గ్రహణం ముగిసింది. ఇది పాక్షికం. ఆరు శాతం మాత్రమే గ్రహణ చీకటి చంద్రుడిని కమ్మింది.

star gazers, of these countries including india enjoyed Lunar eclipse 2023

భారత్‌తో పాటు ఆసియా, ఆఫ్రికా, యూరప్ దేశాల ప్రజలు చంద్ర గ్రహణాన్ని తిలకించగలిగారు. నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్, భూటాన్, మంగోలియా, ఆఫ్ఘనిస్తాన్, చైనా, ఇరాన్, టర్కీ, అల్జీరియా, జర్మనీ, పోలాండ్, నైజీరియా, బ్రిటన్, స్పెయిన్, స్వీడెన్, మలేసియా, ఫిలిప్పీన్స్, థాయ్‌లాండ్, ఆస్ట్రేలియా, జపాన్, ఇండోనేసియా, దక్షిణ కొరియా, ఉత్తర కొరియాల్లో చంద్రగ్రహణం కనిపించింది.

సూర్యుడు- భూమి-చంద్రుడు ఒకే సరళరేఖ పైకి వచ్చినప్పుడు చంద్ర గ్రహణం సంభవిస్తుంటుంది. భూమి నీడ పడి చంద్రుడు చీకట్లోకి వెళ్లిపోతాడు. దీన్ని చంద్ర గ్రహణంగా పిలుస్తారు. భూమి నీడ చంద్రుడిపై కొంతభాగమే పడినప్పుడు అది పాక్షిక చంద్ర గ్రహణం అవుతుంది.

చంద్ర గ్రహణాన్ని ప్రత్యక్షంగా చూడొచ్చు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం లేదు. గ్రహణ కాలంలో నేరుగా చంద్రుడిని చూడొచ్చు. కంటి చూపుపై ఎలాంటి దుష్ప్రభావం పడదు. అందుకే దేశవ్యాప్తంగా స్టార్ గేజర్స్.. తమ స్పేస్ బైనాక్యులర్స్, టెలిస్కోప్‌లకు పని పెట్టారు. చంద్రగ్రహణాన్ని బంధించారు. దేశ రాజధానిలోని నెహ్రూ ప్లానిటోరియం ఈ చంద్రగ్రహణాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+