టెక్కీలకు శుభవార్త చెప్పిన Starlink

Job Opening in Starlink: అపర కుబేరుడు, ప్రైవేట్ అంతరిక్ష పరిశోధన సంస్థ స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్.. భారత్ కు శుభవార్త వినిపించారు. దేశంలో తన శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను ప్రారంభించబోతోన్నట్లు తెలిపారు. స్పేస్‌ఎక్స్ అనుబంధ సంస్థ స్టార్‌లింక్ సేవలు భారత్ లో అందుబాటులోకి రాబోతోన్నాయని అన్నారు. దీనికోసం ఉద్యోగ నియామకాల ప్రక్రియను మొదలుపెట్టినట్లు స్టార్ లింక్ ప్రకటించింది. తొలి రౌండ్ నియామకాలను సైతం చేపట్టింది.

తమ కెరీర్స్ పోర్టల్ ద్వారా పలు డివిజన్లల్లో ఉద్యోగాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోన్నాయి స్టార్‌లింక్, లింక్డిన్, స్పేస్‌ ఎక్స్ సంస్థలు. ఇందులో ఫైనాన్స్, అకౌంటింగ్ విభాగాలకు సంబంధించిన ఉద్యోగాలు ఉన్నాయి. బెంగళూరును కేంద్రబిందువుగా చేసుకుని స్టార్‌లింక్.. తన కార్యకలాపాలను ఆరంభించబోతోంది. దీంతో కొత్త జాబ్ రిక్రూట్ మెంట్స్ కూడా బెంగళూరులోనే జరుగుతాయి. మెజారిటీ ఉద్యోగులకు బెంగళూరులో జాబ్ లొకేషన్ కేటాయించే అవకాశం ఉంది.

Starlink is Hiring in India Ahead of Launch

ట్యాక్స్ మేనేజర్, అకౌంటింగ్ మేనేజర్, పేమెంట్స్ మేనేజర్, సీనియర్ ట్రెజరీ అనలిస్ట్ వంటి స్థానాల కోసం దరఖాస్తులు స్వీకరిస్తోంది స్టార్ లింక్. ఈ ఉద్యోగాలు స్టార్‌లింక్ కార్యకలాపాలకు అవసరమైన ఆర్థిక, నియంత్రణ పర్యవేక్షణకు కీలకం. లో-లేటెన్సీ శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను ప్రపంచవ్యాప్తంగా అందించనున్నామని, ఈ క్రమంలో భారత్ ఉద్యోగాల నియామక ప్రక్రియ చేపట్టినట్టు స్టార్ లింక్ వెల్లడించింది.

అకౌంటింగ్, రిపోర్టింగ్, బ్రాడ్ బ్యాండ్ సర్వీసులను దేశవ్యాప్తంగా విస్తరించడం వంటి కార్యకలాపాలను పర్యవేక్షించాల్సి ఉంటుంది. రిమోట్ లేదా హైబ్రిడ్ ఆప్షన్స్ ఉండబోవని స్టార్ లింక్ స్పష్టం చేసింది. ఉద్యోగుల ఎంపికలో తొలి ప్రాాధాన్యత.. స్థానికంగా నివసిస్తోన్న వారికే ఇవ్వనుంది. మేనేజర్ లెవెల్ నియామకాల్లో స్థానికులకు మాత్రమే అవకాశం ఇశస్తామని, వారి దరఖాస్తులను పరిగణనలోకి తీసుకుంటారు.

స్టార్‌లింక్ తన శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను ఈ ఏడాది డిసెంబర్ లేదా 2026 జనవరి ప్రారంభంలో ఆరంభించబోతోంది. దేశవ్యాప్తంగా ఒకేసారి కమర్షియల్ ఆపరేషన్స్ అందుబాటులోకి వస్తాయి. దీనికి అవసరమైన గ్రౌండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను ఏర్పాటు చేస్తోన్నామని, ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా సేఫ్టీ పరీక్షలను కూడా నిర్వహిస్తోన్నామని స్టార్ లింక్ వెల్లడించింది. స్పెక్ట్రమ్ కేటాయింపునకు ముందు.. డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT) నిబంధనల మేరకు స్టార్‌లింక్ గతంలో ముంబైలో తన బ్రాడ్‌బ్యాండ్ సేవలపై డెమో ఇచ్చింది.

ముంబై, చెన్నై, నోయిడాలో మూడు గేట్‌వే స్టేషన్లను తెరవడానికి అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. దీని తర్వాత, చండీగఢ్, కోల్‌కతా, లక్నోతో సహా మరో తొమ్మిది నుండి 10 గేట్‌వే స్థానాలను నెలకొల్పే అవకాశం ఉంది. దేశంలో స్టార్ లింక్ బ్రాడ్ బ్యాండ్ సేవలు ప్రారంభమైన తర్వాత జియో శాటిలైట్, యూటెల్‌శాట్ వన్‌వెబ్ నుండి పోటీ ఎదురవుతుందనే అంచనాలు ఉన్నాయి. ఈ రెండు సంస్థలు ఇప్పటికే ట్రాయ్ అనుమతులు పొందాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+