వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భార్య స్టేట్ లీడర్, పైగా న్యాయవాది, డ్రైవర్ తో, హలో నేనండి, మొదటి భర్త ఏం చేశాడంటే !

హిందూ సాంప్రధాయం ప్రకారం వివాహం చేసుకున్న కర్ణాటక మహిళ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు భర్తకు చట్టపరంగా విడాకులు ఇచ్చింది.

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: హిందూ సాంప్రధాయం ప్రకారం వివాహం చేసుకున్న కర్ణాటక మహిళ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు భర్తకు చట్టపరంగా విడాకులు ఇచ్చింది. తరువాత ఆమె నిర్వహిస్తున్న స్కూల్ లో వ్యాన్ డ్రైవర్ గా పని చేస్తున్న యువకుడిని మాజీ భర్త సాక్షిగా వివాహం చేసుకున్న విచిత్ర ఘటన కర్ణాటకలో జరిగింది.

నగ్నంగా మహిళ, మర్మాంగంలో కారం పొడి, రోడ్డులో ఊరేగింపు, నా మొగుడితో నీకేం పని !నగ్నంగా మహిళ, మర్మాంగంలో కారం పొడి, రోడ్డులో ఊరేగింపు, నా మొగుడితో నీకేం పని !

కర్ణాటక-ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని (మదనపల్లికి సమీపంలో) చింతామణిలో ఈ వింత ఘటన జరిగింది. మాజీ భర్త పెళ్లి పెద్దగా ఉంటూ తన మాజీ భార్యకు వేరే వ్యక్తితో తమ కుల దైవం అయిన గుడిలోనే స్వయంగా పెళ్లి జరిపించి ఫోటోలు, వీడియోలకు ఫోజు ఇచ్చాడు.

ఆమె స్టేట్ లీడర్

ఆమె స్టేట్ లీడర్

చిక్కబళ్లాపురం జిల్లాలోని చింతామణిలోని అశ్వినీ లేఔట్ లో నివాసం ఉంటున్న ఎస్. రచనా కర్ణాటక రైతు సంఘం మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలుగా పని చేస్తున్నారు. అంతే కాకుండా రచనా ప్రముఖ సీనియర్ న్యాయవాది. న్యాయవాదిగా ఆమెకు మంచి పేరు ఉంది.

రచనాకు విద్యా సంస్థలు

రచనాకు విద్యా సంస్థలు


కర్ణాటక రైతు సంఘం మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలిగా, న్యాయవాదిగా పని చేస్తున్న రచనా విద్యాసంస్థలు నిర్వహిస్తున్నారు. రచనా క్రియేటివ్ ప్రైవేట్ స్కూల్స్ నిర్వహిస్తున్నారు. ఈ విద్యాసంస్థలోని ఓ వ్యాన్ డ్రైవర్ గా మంజునాథ్ అనే యువకుడు పని చేస్తున్నాడు.

15 ఏళ్ల క్రితం లాయర్ తో !

15 ఏళ్ల క్రితం లాయర్ తో !

చింతామణి తాలుకా పెద్దూరు గ్రామంలో నివాసం ఉంటున్న న్యాయవాది ఈశ్వర గౌడ అనే ఆయనతో న్యాయవాది రచనా వివాహం 15 ఏళ్ల క్రితం జరిగింది. చింతామణిలోని అశ్వినీ లేఔట్ లో ఈశ్వర గౌడ, రచనా దంపతులు నివాసం ఉంటున్నారు.

ఇద్దరు పిల్లల తల్లి

ఇద్దరు పిల్లల తల్లి

ఈశ్వర గౌడ, రచనా దంపతులకు ఓ కుమార్తె, ఓ కుమారుడు ఉన్నారు. కుటుంబ కలహాల కారణంగా సంవత్సరం క్రితం (2016) దంపతులు ఇద్దరూ విడాకుల కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తరువాత విడాకులు తీసుకోవడానికి ఈశ్వర గౌడ, రచనా ఇద్దరూ అంగీకరించడంతో న్యాయస్థానం విడాకులు ఇచ్చింది.

మాజీ భర్త పెళ్లి పెద్ద

మాజీ భర్త పెళ్లి పెద్ద

తన స్కూల్ లో వ్యాన్ డ్రైవర్ గా పని చేస్తున్న మంజునాథ్ అనే యువకుడిని వివాహం చేసుకోవాలని న్యాయవాది రచనా నిర్ణయించింది. ఇద్దరూ ప్రేమలో పడ్డారో ఏమో తెలీదు కాని మంజునాథ్, రచనా వివాహం చేసుకోవాలని దృడంగా నిశ్చయించుకున్నారు.

హలో నేను మీ మాజీ భార్య

హలో నేను మీ మాజీ భార్య

మంజునాథ్ ను వివాహం చేసుకుంటున్నానని రచనా మాజీ భర్త ఈశ్వర గౌడకు చెప్పింది. తరువాత ఈశ్వర గౌడ ఇంటి దేవుడి ఆలయంలో ఆయనే పెళ్లి పెద్దగా ఉండి డ్రైవర్ మంజునాథ్ చేత రచనా మెడలో తాళి కట్టించారు. ముగ్గురు కలిసి ఫోటోలకు, వీడియోకు ఫోజు ఇచ్చారు.

దుమ్ములేపేశారు

దుమ్ములేపేశారు

రచనా ఓ డ్రైవర్ ను పెళ్లి చేసుకుందని తెలుసుకున్న ఆమె బంధువులు, మాజీ భర్త ఈశ్వర గౌడ బంధువులు కలిసి డ్రైవర్ మంజునాథ్ ను దుమ్ములేపేశారు. అసలే న్యాయవాది అయిన రచనా పరిస్థితి విషమించిందని గుర్తించి పోలీస్ స్టేషన్ చేరుకుని తన రెండో భర్తకు రక్షణ కల్పించాలని మనవి చేసింది.

నా పెళ్లి నా ఇష్టం

నా పెళ్లి నా ఇష్టం

తన రెండో భర్త మంజునాథ్ మీద దాడి చెయ్యడంతో న్యాయవాది రచనా మండిపోయారు. తన మొదటి భర్త ఈశ్వర గౌడకు చట్టపరంగా విడాకులు ఇచ్చానని, ఇప్పుడు నేనే స్వేచ్చగా ఉన్నానని పోలీసుల ముందు చెప్పారు. నేను డ్రైవర్ ను పెళ్లి చేసుకోవడం తప్పు ఎలా అవుతుంది, ఇది నా పెళ్లి నా ఇష్టం అంటూన్నారు.

సరే వదిలేయండి, మాజీ భర్త

సరే వదిలేయండి, మాజీ భర్త

రచనా ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలని, ఇంతటితో ఈ గొడవ వదిలేయండి అంటూ ఆమె మాజీ భర్త ఈశ్వర గౌడ వారి బంధువులకు చెప్పారు. అయితే మాజీ దంపతులకు ఓ అమ్మాయి, అబ్బాయి ఉండటంతో వారు ఎవరితో ఉంటారు అనే విషయం అర్థం కావడం లేదని రచనా, ఈశ్వర గౌడ బంధువులు వాపోతున్నారు.

English summary
Wife second marriage, State leader intersting marriage in Chintamani in Karnataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X