వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వలస కూలీలతో విధి వింత నాటకం..!మొన్న రైలుబండి, నిన్న ఏపి, నేడు యూపీలో ఘోర ప్రమాదాలు..!

|
Google Oneindia TeluguNews

లక్నో/హైదరాబాద్ : వలస కూలీలపై విధి వింతనాటకమాడుతోంది. జీవనోపాదితో పాటు నిలువ నీడలేక ఛిన్నాభిన్నమైన జీవితాలను నెట్టుకొస్తున్న వలస కార్మికులు విధి ఆడుతున్న వింత నాటకంలో సమిధలుగా మారిపోతున్నారు. కరోనా వైరస్ మహమ్మారి వల్ల ముందే చితికిపోయి, దిక్కుతోచని స్దితిలో రోజులు నెట్టుకొస్తున్న వారి పట్ల హృదయవిధారక సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. లాక్ డౌన్ ఆంక్షలు మొదలైన దగ్గర నుండి వలస కర్మికులు పడరాని కష్టాలు పడుతున్నట్టు తెలుస్తోంది. రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితుల్లో ఇతర రాష్ట్రాల్లో మగ్గిపోతున్న కార్మికులు చేసేది లేక సొంత గ్రామాలకు పయనమవుతున్న నేపథ్యంలో జరుగుతున్న ప్రమాదాలకు నిండు ప్రాణాలను బలితీసేకుంటున్నారు.

వలస కూలీలను పొమ్మన నోటితోనే.. మద్యం అమ్మకాలకు అనుమతి.. సుప్రీంకోర్టు సంచలనం..వలస కూలీలను పొమ్మన నోటితోనే.. మద్యం అమ్మకాలకు అనుమతి.. సుప్రీంకోర్టు సంచలనం..

 వలస కార్మికుల పట్ల వరస ప్రమాదాలు.. పిట్లల్లా రాలిపోతున్న కూలీలు..

వలస కార్మికుల పట్ల వరస ప్రమాదాలు.. పిట్లల్లా రాలిపోతున్న కూలీలు..

వలస కార్మికుల పట్ల జరుగుతున్న వరుస ప్రమాదాలు విచారకరంగా మారుతున్నాయి. మొన్న రైలు ప్రమాదం, నిన్న ఏపిలోని ప్రకాశం జిల్లాలో జరిగిన ప్రమాదం, నేడు యూపిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంతో దేశంలో విషాద ఛాయలు అలుముకుంటున్నాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఔరయ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాజస్థాన్ నుంచి 50 మంది వలస కూలీలు తమ స్వస్థలాలకు ట్రక్కులో తిరిగి వెళ్తుండగా దిల్లీ నుంచి వస్తున్న డీసీఎం ఢీకొట్టింది. శనివారం తెల్లవారుఝామున మూడున్నర గంటలకు జరిగిన ఈ ఘటనలో 24 మంది ప్రాణాలు కోల్పోయారు. 22 మంది గాయపడ్డారు. వారిలో 15 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.

 రెక్కాడితే గాని డొక్కాడని కూలీలు.. చావు దెబ్బ తీసిన ప్రమాదం..

రెక్కాడితే గాని డొక్కాడని కూలీలు.. చావు దెబ్బ తీసిన ప్రమాదం..

మెరుగైన చికిత్స కోసం సైఫైలోని ఆస్పత్రికి తరలించినట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. బాధితులంతా ఉత్తర్​ప్రదేశ్, ఝార్ఖండ్, బంగాల్ రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులుగా అధికారులు గుర్తించారు.ప్రమాదంపై ఉత్తర్​ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించి, ప్రమాద కారణాలపై నివేదిక సమర్పించాలని కాన్పుర్‌ పోలీసు ఉన్నతాదికారులను యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలన్నారు.

 దారుణమైన పరిస్ధితులు నెట్టుకొస్తున్న కూలీలు.. ఇళ్లకు చేరకుండానే అనంతలోకాలు..

దారుణమైన పరిస్ధితులు నెట్టుకొస్తున్న కూలీలు.. ఇళ్లకు చేరకుండానే అనంతలోకాలు..

లాక్ డౌన్ ఆంక్షలు.. ఉండానికి గూడు లేదు, తినడానికి తిండి లేదు, కొనుక్కుందామనుకుంటే చేతిలో చిల్లి గవ్వ లేదు. ఇది ఉత్తర ప్రదేశ్ లో ప్రమాదం జరిగిన కార్మికుల దీన గాధ. చేసేది లేక సొంతూళ్లకు పయనమైన వారి పట్ల లారీ మృత్యు శకటంగా పరిణమించింది. కాగా ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో నిర్మాణ కార్మికునిగా పనిచేస్తున్న 20 ఏళ్ల ఓం ప్రకాష్ దీన‌గాథ అంద‌రినీ కంట‌త‌డి పెట్టిస్తోంది. ఓంప్రకాష్ ఇల్లు బీహార్‌లోని సరన్‌లో ఉంది. ఇది గ్రేట‌ర్ నోయిడాకు వెయ్యి కిలోమీటర్ల దూరంలో ఉందని తెలుస్తోంది. ఇంటికి వెళ్లేందుకు సిద్ధ‌మైన ఓంప్ర‌కాష్‌ ఆగ్రా వ‌ర‌కూ కాలినడకన దాదాపు రెండు వందల కిలోమీటర్లు న‌డిచాడు.

 యూపీలో ఘోర ప్రమాదం.. 24మంది మరణం..

యూపీలో ఘోర ప్రమాదం.. 24మంది మరణం..

త‌రువాత‌ ట్రక్కులో ఎక్కి, మూడువందల యాభై కిలోమీటర్ల దూరంలోని లక్నోకు చేరుకున్నాడు. అప్పుడు అత‌ని జేబులో కేవలం రూపాయలు మాత్రమే మిగిలింది. అయితే ఓంప్ర‌కాష్‌ ఇంటికి వెళ్ళడానికి ఇంకా వందల కిలోమీటర్లు నడవాలి. అయితే అక్క‌డ ఉన్న పోలీసులు వ‌ల‌స కూలీల‌ను బ‌స్టాండ్ వ‌ర‌కూ త‌ర‌లించారు. ఓంప్రకాష్ మాదిరిగా కొంత మంది వ‌ల‌స కూలీలు లక్నో సమీపంలోని టోల్ ప్లాజాపై న‌డుస్తూ గ్రామాల‌కు వెళుతున్నారు. మ‌రికొంద‌రు కూలీలు లారీ డ్రైవర్లకు భారీ మొత్తాలు చెల్లించి గ్రామాల‌కు వెళుతున్నారు. ఇంతటి దయనీయమైన జావితాలను వెళ్లదీస్తున్న వలస కార్మికులపై జరుగుతున్న వరస ప్రమాదాలు ఎంతో శోచనీయంగా మారాయి.

English summary
A deadly road accident occurred at Auraiya in Uttar Pradesh. The DCM coming from Delhi collided as 50 migrant workers from Rajasthan were returning to their hometowns by truck. The incident, which took place at three o'clock in the morning on Saturday, left 24 people dead.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X