Viral Video: అర్ధరాత్రి మహిళపై యువకుడి అఘాయిత్యం.. తరిమికొట్టిన వీధి కుక్కలు..!
సమాజంలో రోజురోజుకూ మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. మహిళ ఒంటరిగా కనబడితే చాలు మగాళ్లు.. మృగాళ్ల మాదిరి రెచ్చిపోతున్నారు. చిన్నాపెద్దా అన్న తేడా లేకుండా.. వావి వరసలు మరచి అత్యాచారాలకు తెగబడుతున్నారు. తమ కామ వాంఛ కారణంతో ఎన్నో కుటుంబాలను ఛిన్నాభిన్నం చేస్తున్నారు. ఇటీవల దేశ రాజధాని దిల్లీలో మరోసారి నిర్భయ లాంటి ఘటన జరిగిన విషయం తెలిసిందే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోక్సో, నిర్భయ, దిశ లాంటి ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా ఇలాంటి ఘటనలు మాత్రం ఆగడం లేదు. తాజాగా తమిళనాడులోని కోయంబత్తూరులో షాకింగ్ ఘటన జరిగింది.
కోయంబత్తూరు తుడియలూరు పరిధిలోని జాతీయ రహదారి రైల్వే వంతెన కింద సెప్టెంబర్ 3 వ తేదీ, అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఓ మహిళ రోడ్డు పక్కన ఒంటరిగా కూర్చుని ఉంది. అర్ధరాత్రి కావడంతో ఆ రూట్ లో ఎవరూ లేరు. వీధి కుక్కలు మాత్రమే ఉన్నాయి. ఆ మహిళ అనారోగ్యంతో ఉన్నట్లు కనిపిస్తోంది. ఒంటరిగా రోడ్డు పక్కన ఆ మహిళ సేద దీరుతోంది. ఇంతలో ఓ యువకుడు అటుగా వచ్చాడు. రోడ్డు పక్కన ఒంటరిగా ఉన్న ఆ మహిళను చూసి ఆగాడు. అయితే అదే సమయంలో అతనివైపు ఓ వీధి కుక్క అరుస్తూ వచ్చింది. దాంతో అతడు ఓ రాయి తీసుకుని దాన్ని బెదరగొట్టేందుకు ప్రయత్నం చేశాడు.
Dog turns saviour, foils molestation
— Raajeev Chopra (@Raajeev_Chopra) September 4, 2026
Stray dogs save woman from molestation in Tamil Nadu.#Heros pic.twitter.com/cOIbQfrTk7
ఇక ఆ యువకుడ్ని చూసిన మహిళ భయంతో లేచి వెనక్కు వెళ్లింది. అలా ఒక్కసారిగా మహిళపైకి దూసుకొచ్చిన ఆ యువకుడు ఆమెపై లైంగిక దాడికి ప్రయత్నించాడు. ఆమె గట్టిగా అరిచేందుకు ప్రయత్నం చేయగా నోరు మూసి అఘాయిత్యం చేయబోయాడు. అయితే అక్కడే ఉన్న వీధి కుక్క ఆ యువకుడ్ని కరిచే ప్రయత్నం చేసింది. అయినా కూడా ఆ మహిళను వదలకుండా అలాగే పట్టుకుని లైంగికంగా వేధించసాగాడు.

మహిళ ఆర్తనాదాలు విని రెండు వీధి కుక్కలు అక్కడికి చేరుకుని గట్టిగా మొరుగుతూ అతనిపైకి దూకాయి. కుక్కల దాడిలో గాయపడిన ఆ యువకుడు ఆమెను వదిలేసి అక్కడి నుంచి పారిపోయాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు స్థానికంగా ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. సీసీటీవీ ఫూటేజ్ ఆధారంగా ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. ఘటన సమయంలో నిందితుడు మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు.












Click it and Unblock the Notifications