ఇదే పని? : విద్యార్థినికి బట్టతల ఉందని.. పాఠశాలలో అడ్మిషన్‌ ఇవ్వలేదు

బట్టతల ఉందన్న కారణంతో ఓ బాలికకు అడ్మిషన్ ఇవ్వడానికి నిరాకరించింది ఓ పాఠశాల యాజమాన్యం.

న్యూఢిల్లీ: బట్టతల ఉందన్న కారణంతో ఓ బాలికకు అడ్మిషన్ ఇవ్వడానికి నిరాకరించింది ఓ పాఠశాల యాజమాన్యం. ఢిల్లీకి చెందిన అన్షిత గుప్తా(13) అలోపెషియా అనే వ్యాధితో బాధపడుతోంది.

ఈ వ్యాధి కారణంగా అన్షితకి మూడేళ్ల వయసులోనే బట్టతల వచ్చింది. ప్రస్తుతం విడతలుగా చికిత్స తీసుకుంటున్న అన్షిత తొమ్మిదో తరగతిలో చేరేందుకు తూర్పు ఢిల్లీలోని వనస్థలి పబ్టిక్ పాఠశాలలో అడ్మిషన్ కోసం వెళ్లింది. అక్కడ ప్రవేశ పరీక్షలో కూడా పాసయింది.

కానీ అన్షిత బట్టతలను చూసి తోటి విద్యార్థులు హేళన చేస్తారన్న కారణంతో ఆమెను పాఠశాలలో చేర్చుకునేందుకు స్కూల్ యాజమాన్యం నిరాకరించింది. దాంతో అన్షిత తల్లదండ్రులు ఈ విషయాన్ని మీడియా దృష్టికి తీసుకెళ్లారు.

Suffering from baldness, 13-year-old denied school admission

చదువు చెప్పడం, చదువుకోవడం ముఖ్యం కానీ విద్యార్థుల శరీరాకృతి ఎలా ఉంటే ఏంటి అంటూ అన్షిత తల్లి శైలేష్ గుప్తా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రవేశ పరీక్షలో పాసయ్యాక స్కూల్ యాజమాన్యం మిగతా వివరాలు పూర్తి చేయాలని పిలిపించారని, తీరా వెళ్లాక బాలికకి జుట్టు పెరిగాక చేర్పించండని చెప్పారని ఆమె పేర్కొంది.

అన్షిత ఎనిమిదో తరగతిలో 77 శాతం మార్కులతో పాసైందని తొమ్మిదో తరగతిలో పేరున్న పాఠశాలలో చేర్పించాలని తీసుకొచ్చామని తల్లిదండ్రులు చెబుతున్నారు. అన్షిత గతంలో చదివిన పాఠశాలలో ఎలాంటి అవమానాలు ఎదుర్కొనలేదని వెల్లడించారు. అయితే ఈ విషయమై పాఠశాల ప్రిన్సిపల్ అనురాధా జైన్ మాట్లాడుతూ.. తమకి ఆడపిల్లలంటే చాలా ఇష్టమని, చదువుకునే పిల్లలు ఎలా ఉన్నా సీట్లు ఇవ్వడానికి సిద్ధమేనని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+